కాంగ్రెస్, లోక్‌సత్తా... ఇదీ మీ సత్తా

Publish Date:Feb 17, 2015

Advertisement

 

తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఫలితం వెలువడింది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా ఫలితం ఎలా వుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ వుంటుంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఎవరికీ అంతటి ఆసక్తి లేదు.. ఉత్కంఠ అంతకన్నా లేదు. ఎందుకంటే, ఈ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య, టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ విజయం సాధిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి. తిరుపతి ఓటర్లకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే చాలామంది ఓటు వేయడానికే వెళ్ళలేదు. 50 శాతం ఓట్లే అక్కడ పోలయ్యాయి. ఎలాగూ గెలిచేది సుగుణమ్మే... ఆమాత్రం దానికి మనం శ్రమపడి పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళడం ఎందుకు అని అనుకుని వుంటారు. 50 శాతం పోలింగే జరిగినా సుగుణమ్మకు 1,16,524 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలింగ్ ఇంకా ఉద్ధృతంగా జరిగి వుంటే ఆమె మెజారిటీ రెండున్నర లక్షలు దాటిపోయి వుండేది. సరే, సుగుణమ్మ గెలుపుతో తిరుపతి ఎన్నికల హడావిడి ముగిసింది. కానీ, ఇప్పుడు ప్రారంభం కావలసింది కాంగ్రెస్, లోక్‌సత్తా పార్టీల్లో అంతర్మథనం.

 

సంప్రదాయం ప్రకారం తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం కావలసి వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సమాధిలో పడివున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏదో ఆశ. సమాధిలోంచి పైకి లేచి మళ్ళీ ఏపీ జనాలను పీడించలన్న పేరాశ... ప్రేతాశ. అందుకే తిరుపతిలో పోటీ చేయాలని గాఠ్ఠిగా డిసైడైంది. ఇక జనాల్లో వాల్యూ ఏనాడో పోగొట్టుకున్న లోక్‌సత్తా కూడా ఠాఠ్ మేం పోటీలో నిలుస్తాం.. మేం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని స్టేట్‌మెంట్ పారేసి పోటీలో నిలిచింది. ఈ రెండు పార్టీలు రంగంలో వున్నాయి కాబట్టి మేమూ రంగంలో వున్నామంటూ కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఫలితం.... ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరపడం వల్ల ప్రజాధనం ఖర్చయింది. కాకపోతే, కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా పార్టీ మరోసారి అంతర్మథనం చెందే అవకాశం వచ్చింది.

 

ఈ మాట అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫీలవుతారేమో... అయినా పర్లేదు... వాస్తవం అనక తప్పదు.. ఆ వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలక అసహ్యం, రోత, చీదర... ఇలాంటి పదాలు ఇంకా ఏవైనా వుంటే అవన్నీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని గానీ, ఆ పార్టీ నాయకుల ముఖాలను గానీ చూడ్డానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడటం లేదు. తమకు ఏపీలో ఎంతమాత్రం విలువలేదని తెలిసినా ఇంకా ఏదో బావుకుందామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే జాలి వేయడం కాదు.. చిరాకు పుడుతోంది. దీనికితోడు తిరుపతిలో రిగ్గింగ్ చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి స్టేట్‌మెంట్ ఒకటీ... ఏమయ్యా పెద్దమనీషీ... మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇంకా ఎంతకాలం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని అనుకుంటున్నారు? మీరు స్వర్గానికి వెళ్ళి అమృతభాండం పట్టుకొచ్చినా అందులో విషం వుందనే ఏపీ ప్రజలు భావిస్తారు. ప్రజల్ని నమ్మించడానికి మీరు కాస్త తాగి చూపించినా నమ్మరు... అదీ ఏపీలో మీ పార్టీ పరిస్థితి... అందువల్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం పుచ్చుకుని ఇళ్ళలో కూర్చుని, సంపాదించిన ఆస్తులు లెక్కపెట్టుకుంటూ టైంపాస్ చేస్తే మంచిది.

 

ఇక లోక్‌సత్తా... ఈ పార్టీకి ఎక్కడా ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడే గెలిచే సత్తా లేక చతికిలపడ్డాడు. అదీ ఈ పార్టీకున్న ప్రజాబలం. ఇలాంటి పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ కంకణం కట్టుకుందట. వారసత్వ రాజకీయాలను ఎదిరించదలచుకుంటే ప్రజలు వ్యతిరేకిస్తారు... మధ్యలో లోక్‌సత్తా ఎవరు? తనకుమాలిన ధర్మాన్ని పట్టుకుని తిరుపతి ఎన్నికల బరిలో నిలిచింది కాబట్టే లోక్‌సత్తాకీ ప్రజలు బుద్ధి చెప్పారు. అధికారపార్టీ మీద ఎంత దుమ్మెత్తి పోసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు తొమ్మిది వేల చిల్లర. లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లు మూడు వేల చిల్లర... ఈ రెండు పార్టీలూ ఇలా ఏపీలో చిల్లర కోసం పాకులాడకుండా సైలెంట్‌గా వుంటే బెటర్.

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.