కిరణ్ - జగన్ లాలూచీ పడ్డారా?

Publish Date:Apr 28, 2012

Advertisement

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ తో లాలూచీ పడినట్టు కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరగడం కిరణ్ కు ఇబ్బందిగా మారింది. దాంతో ఆయన తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిని స్వయంగా విమర్శించకపోయినా తన అనుంగ మంత్రులు, అనుచరుల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్ల తాను జగన్ తో లాలూచీ పడినట్టు ప్రచారం చేయడం తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

వై.ఎస్.ఆర్. పార్టీని, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్న మంత్రులలో కొండ్రు మురళి ఒకరు. మురళి తనకు అత్యంత సన్నిహితుడని, అతను జగన్ ను విమర్శిస్తున్నాడంటే తాను విమర్శిస్తున్నట్టేనని వివరణ ఇచ్చుకొంటున్నారు. అయితే శంఖంలో పోస్తే తీర్థం అయినట్టు ఎంతమంది ఎంత ఘాటుగా విమర్శ చేసినా ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ స్వయంగా విమర్శ చేసినప్పుడు దానికి విలువ వుంటుందని వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్థన్ వంటి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తాను విమర్శించకుండా తన తరపున తన అనుచరులు విమర్శిస్తున్నారని చెప్పే కిరణ్ చెప్పడం పార్టీని, పార్టీ కార్యకర్తలను మోసం చేయడమేనని కిరణ్ వ్యతిరేకులు అంటున్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కూకట్‌పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ  బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా  బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.