బాబు ర్యాంకుల వెనుక క్యా మతలబ్ హై..!

Publish Date:Apr 20, 2016

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్క్ ఆఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీనైనా..ప్రభుత్వాన్నైనా కార్పోరేట్ స్టైల్లో నడుపుతారు.  ఉద్యోగుల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు చేసి వారికి ర్యాంక్స్ ఇవ్వడం కార్పోరేట్ కంపెనీల స్టైల్. అలా ర్యాంకింగ్‌లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరచుకుంటారు. అలాగే పూర్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి త్వరలోనే ఊస్టింగ్ రెడీ అవుతుందని సంకేతాలు పంపడం సర్వే మెయిన్ కాన్సెప్ట్. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో ఐటీకి కేరాఫ్ ఆడ్రస్‌గా నిలిచిన ఆయన తనను తాను రాష్ట్రానికి సీఈవోగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్న బాబు తన కేబినెట్ మంత్రుల పనితీరుపై పర్ఫామెన్స్ రిపోర్టులు తయారు చేయించి ర్యాంకింగ్స్ ఇచ్చారు.

 

ఎప్పుడూ ఇచ్చే ర్యాంకింగ్సే అనుకున్నారు అంతా కాని ముఖ్యమంత్రి ఊహించని స్ట్రోక్ ఇచ్చారు. ఈ సారి ఓడలు బళ్లయ్యాయి..బళ్లు ఓడలయ్యాయి. అధినేతకు క్లోజ్‌ అనుకున్నవారు-ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనుకున్నవారు వెనుకబడిపోయారు..సరిగా పనిచేయడం లేదని..వేటు తప్పదని భావించిన వారంతా ముందుకొచ్చారు. ఇదేంటో అర్థంకాక మంత్రులు జుట్టుపీక్కుంటున్నారు. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిస్థితి చెప్పనక్కర్లేదు. సీఎంకు రైట్ హ్యాండ్‌గా..ల్యాండ్‌పూలింగ్‌లో..ప్రభుత్వంలో దాదాపు అన్నీ తానై చక్రం తిప్పుతున్న నారాయణకు చిట్టచివరి ర్యాంక్ వచ్చింది. ప్రభుత్వంలో నెంబర్ 2, ఆర్ధిక మంత్రి యనమలకు 15, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి 17వ ర్యాంక్ వచ్చింది.

 

అదే సమయంలో అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కు, వడ్డాణం, డబ్బుల సంచి తదితర వివాదాలతో ఎప్పుడు మంత్రి పదవి పోతుందోనని ఆందోళనలో ఉన్న పీతల సుజాత అనూహ్యంగా మొదటి ర్యాంక్‌ కొట్టేశారు. అలాగే మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించి పార్టీ పరువు తీసిన మంత్రి రావెల కిశోర్ బాబుకు 6వ స్థానం. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ర్యాంకులు వచ్చాయి. చంద్రబాబు మైండ్ గేమ్‌ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఏ పని చేసినా దాని వెనుక లోతైన మర్మం దాగుంటుంది.

 

అలాగే ఇప్పడు ఇచ్చిన ర్యాంకులను అర్థం చేసుకుంటే చాలా మంది మంత్రులు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం వల్ల పార్టీ ఇమేజ్ పడిపోతోంది. కొత్తగా వచ్చిన అధికారంతో అంతా తాము చెప్పినట్టే జరగాలని పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది. వీళ్ల జోరు తగ్గించడంతో పాటు,  ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ, రిజర్వేషన్లు తదితర అంశాలు భవిష్యత్తులో తనను టార్గెట్ చేయకుండా ఉండటానికి ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను చూసిచూడనట్లుగా వదిలివేయాలని టీడీపీ అధినేత భావించారు.

 

దళిత నేత అయిన రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో కేసీఆర్ పట్ల పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యాపించాయి.ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బాబు తన కేబినెట్‌లోని దళిత మంత్రులను అందలం ఎక్కించి తద్వారా ఆ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా చూసుకున్నారు. దానితో పాటు విశాఖకు చెందిన కీలక నేత గంటా వ్యవహరశైలిపై ముఖ్యమంత్రి ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటీకే చాలాసార్లు సీరియస్ అవుతున్నప్పటికీ ఈ మంత్రి గారి తీరు మారకపోవడంతో బాబు గుర్రుగా ఉన్నారు. అందుకే గంటాకి లెక్కలతో షాక్ ఇచ్చారు .

 

అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో తన మార్క్ పడలేదని భావిస్తున్నారు చంద్రన్న. రాబోయేది కీలక సమయం..ఎన్నికలపై ప్రభావం చూపించే కాలం కావడంతో సమర్థులైన వారిని కేబినెట్‌లో తీసుకోవాలనుకుంటున్నారు. మంత్రులకు ఈ ర్యాంక్‌లు ఒక హెచ్చరిక కావచ్చు లేక ఎవరి పదవి పోతుందో ముందుగానే బాబు తెలియజేసి ఉండవచ్చు. మొత్తానికి బాబు ర్యాంకుల వెనుక రహస్యాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఏదైనా పనిచేసేముందు దానికి సంబంధించిన సంకేతాలివ్వడం బాబు స్టైల్. ఆ ట్విస్ట్ ఎంటో అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది.

By
en-us Political News

  
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.