బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీ.. బీమిలి బాధ్యతలు అప్పగించిన జగన్.. స్థానిక సమరమే తొలి సావాల్.!

Publish Date:Sep 30, 2026

Advertisement

రాజకీయాల్లో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.  దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతల కుటుంబాల నుంచి కొత్త తరం నాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే..  సహజంగానే అందరి దృష్టి వారిపై కేంద్రీకృతమవుతుంది.  ప్రస్తుతం అలాంటి ఆసక్తిని, చర్చను బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీ రేకెత్తిస్తోంది. బొత్స అనూష, రాష్ట్ర రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె.   తాజాగా ఆమె విశాఖపట్నం పరిధిలోని భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు అయితే, రాజకీయాల్లో ఆమెకు ఇది కేవలం సాధారణ ఆరంభం మాత్రమే కాదు.. తొలి అడుగులోనే ఒక భారీ సవాల్ ను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాలలో కీలక నియోజకవర్గాలలో భీమిలి కూడా ఉంది. 

విశాఖ నగరానికి సమీపంలో ఉండటంతో పాటు, ఈ ప్రాంతంలో గ్రామీణ,  పట్టణ రాజకీయాల మిశ్రమ స్వభావం ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తుంది.  ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల మార్పుల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొత్త పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం వంటి మండలాలుకీలకంగా మారగా, పెందుర్తి పరిధిలోని ప్రాంతాలు కూడా ఈ రాజకీయ సమీకరణాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.  

దీనివల్ల భీమిలి కేవలం సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంగా మాత్రమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల రాజకీయాలకు  ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇక్కడే బొత్స అనూషకు అసలైన పరీక్ష .  పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో క్యాడర్‌‌ను సమన్వయం చేయడం, స్థానిక నాయకత్వాన్ని ఏక తాటిపై నడిపించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ను యాక్టవేట్ చేయడంవంటి కీలక బాధ్యతలు ఆమె నిర్వర్తంచాల్సి ఉంది.  క్యాడర్‌ను తిరిగి యాక్టివ్ చేయడం వంటివి ఆమె ముందున్న ప్రధాన సవాళ్లు. అంతకు మించి..  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సత్తా చాటాల్సి ఉంది.  ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  

బొత్స కుమార్తెగా నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలు అయితే వచ్చాయి కానీ, ఇక ముందు బొత్స కుమార్తె గా మాత్రమే రాజకీయం చేస్తానంటే కుదరదు.  క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై గళమెత్తాల్సి ఉంటుంది . గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమవ్వాల్సి ఉంటుంది. క్యాడర్‌లో ఉత్సాహం నింపాలి, స్థానిక సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి పార్టీల క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను ఎదుర్కొంటూ వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను ఎంత మేరకు యాక్టివ్ చేయగలరన్న దానిపైనే బొత్స అనూష్ రాజకీయ భవిష్యత్  ఆధారపడి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   


[Botsa Anusha, Bheemili Constituency, Botsa Satyanarayana, YCP, Andhra Pradesh Politics, Challange, Reai Test, Telugu One]

By
en-us Political News

  
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.