అమరావతా, హైదరాబాదా: చంద్రబాబు ఎంచుకున్న నగరం ఏంటంటే.?
Publish Date:Oct 22, 2026
Advertisement
18 ఏళ్ల లోపు పిల్లలతో చంద్రబాబు ఇంట్రాక్షన్ యువతతో అనుసంధానం కావడానికి ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. తాజాగా చంద్రబాబు సోషల్ మీడయి వేదికగా 18 ఏళ్ల లోపు పిల్లలతో జరిపిన సంభాషణ ఆయనలోని జోవియల్ నేచర్ కీ, యువతతో కనెక్ట్ అవ్వడంలో ఆయన చూపుతున్న చొరవకు అద్దం పట్టింది. ఈ సంభాషణలో యువతలోని అవగాహన శక్తి, అంశాలపై వారికి ఉన్న పట్టు చంద్రబాబులో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ఈ సంభాషణలో ఆయన హృదయానికి దగ్గరైన అంశాలపై పిల్లలు అదీ 18 ఏళ్ల లోపు పిల్లలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సరదాగా సరళంగా సమాధానాలు ఇచ్చారు. ఓ పిల్లాడు.. హైదరాబాద్ అమరావతిలలో ఏది మీకు ఇష్టం అన్న ప్రశ్నకు చంద్రబాబు..ఒక దానిని ఎంచుకోవడం కష్టమని బదులిచ్చారు. అయితే అలా కాదు రెండింటిలో ఏది ఎక్కువ అన్నది స్పష్టంగా చెప్పాలని పిల్లలు ఇన్ సిస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు ప్రస్తుతం తనకు అమరావతి అంటేనే ఎక్కువ మక్కువ అని చెప్పారు. హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ గుండెకాయ వంటిదని, అది మొత్తం నగరానికి వ్యాపార చోదక శక్తిగా ఉందని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి, హైదరాబాద్ రెండూ తన కృషికి నిదర్శనమని, ఈ రెండు కీలక నగరాల నిర్మాత తాను అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానన్నారు. వృత్తి జీవితం లేదా కుటుంబ జీవితం ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారన్న ప్రశ్నకు ఆయన క్షణం ఆలోచించకుండా వృత్తి అని బదులిచ్చి.. పని పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేశారు. అయితే చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు అంతటితో ఆయనను వదల లేదు.. హెరిటేజ్, తెలుగుదేశం పార్టీ.. ఈ రెంటిలో ఏది మీకు ముఖ్యం అన్న ప్రశ్న సంధించారు. దీనికి కూడా చంద్రబాబు క్షణం ఆలోచింకకుండా తెలుగుదేశం అని బదులిచ్చారు. 18 ఏళ్ల లోపు పిల్లలతో జరిగిన ఈ సంభాషణలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలన్నీ, ఆయన పనికి ఇచ్చే ప్రాధాన్యత, ప్రజా శ్రేయస్సుకోసం ఆయన పడే తపనకు అద్దం పట్టాయి. దాదాపు ఐదు దశాబ్దాల చందరబాబు ప్రజా జీవితంలో చంద్రబాబు సదా ప్రజల కోసం, రాష్ట్రం కోసం అంకిత భావంతో చేసిన కృషి ఆయనతో సంభాషించిన పిల్లలకు నిస్సందేహంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
కుటుంబం కంటే పనే ముఖ్యమన్న సీఎం
హెరిటేజ్ కాదు తెలుగుదేశమే తన ఎంపిక అని స్పష్టీకరణ
ఇది జెన్ జీ యుగం.. దేశంలోని రాజకీయ నాయకులంతా యువతతో కనెక్ట్ అవ్వడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. వారికి చేరువ కావడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. అయితే అలాంటి ప్రయత్నాలేమీ చేయనవసరం లేకుండానే తన పనితీరుతో, భవిష్యత్ సాంకేతికతను ఇప్పుడే అందిపుచ్చుకునే ఉత్సాహంతో 75 ఏళ్ల నారా చంద్రబాబు యువతతో అతి సులువుగా, సులభంగా కనెక్ట్ అవుతున్నారు.
[Chandrababu Naidu Intraction With Kids, Hyderabad vs Amaravati, Telugu Desam Party, Heritage, Family, Work, Chandrababu Kids Quiz, Telugu One]
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-intraction-with-kids-43-235059.html





