ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు: చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం ఓకే.!
Publish Date:Oct 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజ్ణప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సాయి ప్రసాద్ వచ్చే ఏడాది మే 31 వరకూ ఏపీ సీఎస్ గా కొనసాగుతారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సాయిప్రసాద్ వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పాలనాపరంగా కీలక కార్యక్రమాలు అమలులో ఉండటంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఆయన సేవలు మరికొంత కాలం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ణప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సాయిప్రసాద్ పదవీకాల పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఎన్నికల వేళ పరిపాలనా యంత్రాంగంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా, సమర్థవంతమైన నాయకత్వాన్ని కొనసాగించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.
[Center Extends AP Chief Secretary Tenure, Dopt Orders, CBN, Request, AP Government, CS, Sai Prasad, Telugu One]
http://www.teluguone.com/news/content/center-extends-ap-chief-secretary-tenure-43-235063.html





