రాజకీయ నేతల ఇళ్ల గురించిన ఆరోపణల… ‘గృహ హింస’!

Publish Date:Apr 14, 2017

Advertisement

 

గతంలో ఒక నేత మీద మరోక నేత ఆరోపణలు చేసుకోవాలంటే పాలన పరమైన దోషాలు వెదికే వారు. తరువాతి కాలంలో అవినీతి కోణాల్ని దొరకబుచ్చుకుని ఇరుకున పెట్టేవారు. ఇప్పుడు అదంతా పోయింది. కొత్తగా పర్సనల్ ఎటాక్స్ ఎక్కువైపోయాయి! రాజకీయ నేత పబ్లిక్ లైఫ్ తో ఎలాంటి సంబంధం లేని విషయాల్ని పెద్ద రచ్చ చేసే ఎజెండా అమలవుతోంది. దీంట్లో ప్రతిపక్షం, పాలకపక్షం, మీడియా, సోషల్ మీడియా అన్నీ భాగం అవుతన్నాయి!

 

ఈ మధ్య కాలంలో చంద్రబాబు హైద్రాబాద్ నూతన నివాసం మీద పెద్ద రచ్చ జరిగింది. అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఇక్కడ ఎప్పట్నుంచో వుంటోన్న పాత ఇంటిని కూల్చి కొత్తగా కట్టుకున్నారు. ఆ విషయంపై వైసీపీ వారు అనవసర రాద్దాంతానికి తెర తీశారు. చంద్రబాబు ఇళ్లు కోట్లు విలువ చేసేలా కట్టారని, అంత దుబారా ఎందుకనీ ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు కట్టింది ప్రజా ధనంతో కానప్పటికీ ఆయన సీఎంగా వున్నారు కాబట్టి ప్రతిపక్షం టార్గెట్ చేసింది. కాని, గతంలోనే లోటస్ పాండ్ అనే పేరుతో భారీ ఇంధ్ర భవనం నిర్మించిన జగన్ , ఆయన పార్టీ వారు చంద్రబాబును టార్గెట్ చేయటం కాస్త విడ్డూరమే!

 

కొందరు చెబుతన్న దాని ప్రకారం చంద్రబాబు ఇళ్లు కేవలం మూడు బెడ్ రూమ్ ల సముదాయం మాత్రమే. బెడ్ రూమ్స్ కాక ఒక హాల్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ లాంటివి వున్నాయట. బంజారా హిల్స్ , జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఇలాంటి కట్టడాలు మామూలే! కాని, చంద్రబాబు విలాసవంతమైన ఇల్లు కట్టాడని విమర్శిస్తున్న వైసీపీ నేతలు పట్టించుకోని విషయం లోటస్ పాండ్ సంగతే! అందులో ఏకంగా ముప్పై గదులు వున్నాయని, అవ్వి  కాకుండా ఇతరరత్రా ఏర్పాట్లన్నీ కలిపితే అరవై గదుల దాకా సంఖ్య చేరుతుందని అంటున్నారు. అలాగే, బ్యాడ్మింటన్ కోర్టులు, ఎస్కలేటర్లు, మీటింగ్ హాల్సు, స్వీమ్మింగ్ పూల్ లాంటి సౌకర్యాలు కూడా వున్నాయట! ఇవన్నీ ఖచ్చితంగా చెప్పటం ఎవరి వల్లా కాదు. కాకపోతే, జగన్ పై వున్న కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఆయన లోటస్ పాండ్ నివాసం కోట్లు పలుకుతుందనే అభిప్రాయపడింది!

 

ఇంతకీ… చంద్రబాబు, జగన్ ఇళ్లలో ఎవరిది ఎక్కువ ఖరీదైంది? లోటస్ పాండ్ విస్తరించి వున్న వైశాల్యం చాలు ఏ నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవసరమయ్యేది చెప్పటానికి! చంద్రబాబు నివాసానికి కంటే అది చాలా రెట్లు పెద్దది. కాబట్టి వైసీపీ నేతలు అనవసరంగా సీఎం వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది. కారణం , ఇప్పుడున్న సోషల్ మీడియా జమానాలో చర్చంటూ ఒక్కసారి మొదలయ్యాక ఎదుటి వారు కూడా బలంగానే వాదన వినిపిస్తారు. అప్పుడు అన్ని విషయాలు బయటపడిపోతాయి! ఇంతా చేస్తే… జగన్, చంద్రబాబుల ఇళ్లపై చర్చ ఏ విధంగానైనా ఆంధ్ర ప్రజలకి మేలు చేస్తుందా అంటే… ఏమీ లేదు! అందుకే, డబ్బున్న వాళ్లు కట్టుకునే ఇళ్ల గొడవకన్నా ఇళ్లు లేని పేదల కష్టాల గురించి మాట్లాడుకుంటే బెటర్!

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.