అభివృద్ధికి అడ్డంకిగా భూసేక"రణం"

Publish Date:Jul 11, 2016

Advertisement

ఎక్కడబడితే అక్కడ భూసేకరణ..నిన్న రాజధాని కోసం అన్నారు..ఇప్పుడు పవర్‌ప్లాంట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌ల కోసం అంటున్నారు. భూములను బతకనివ్వరా..? ఇది ఏపీలో భూసేకరణ జరుగుతున్న వివిధ ప్రాంతాల్లోని రైతుల అక్రందన. భోగాపురం, కొవ్వాడ, పొలాకి, బందరు ఇలా ప్రాంతమేదైనా..ప్రాబ్లమ్ మాత్రం ఒక్కటే..వినిపించేది భూములు ఇచ్చేది లేదన్న మాటే. అందుకు కారణం ఒక్కటే..ఇన్నాళ్లూ భూమికి రేటు లేదు. రెండు పంటలు పండనీ..అసలు పండకపోయినా ఎకరం పది లక్షలు పలికితే గొప్పే..ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్న తరువాత..ఇప్పటికే ఎకరం 40, 50 లక్షలు పలుకుతోంది..ఇలాంటి సమయంలో భూములు లాక్కుంటానంటే రైతులకు మంటే..?

 

కోనేరు సెంటర్ టు హుస్సేన్‌పాలెం..కోనేరు సెంటర్ టూ చిలకలపూడి ఈ పేర్లు చెప్పగానే కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం గుర్తొస్తుంది కదూ. బ్రిటీష్ హయాంలో ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందిన మచిలీపట్నం..ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉంది..ఎన్నాళ్లు తిరగని..ఎన్నేళ్లు గడవనీ..ఇప్పటికే అదే పరిస్థితి పావలా మార్పు కూడా లేదు. ఇక్కడ పోర్ట్ నిర్మిద్దామని  ప్రభుత్వం అలా అనుకుందో లేదో..పోర్ట్‌కు మేం వ్యతిరేకం..మా భూముల జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటాం అంటూ అక్కడి ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. బందరు పోర్ట్ వస్తే ఇన్‌ఫ్రా డెవలప్ అవుతుంది. మంచి రోడ్లు, పరిశ్రమలు, రాకపోకలు వాటికి తగ్గట్టే ఏరియా రూపురేఖలే మారిపోతాయి.

 

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్నా ఉత్తరాంధ్ర వెనుకబడే ఉంది. పొట్టచేత పట్టుకొని నిత్యం సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఉత్తరాంధ్ర దౌర్భాగ్యం. నిరక్షరాస్యత, రక్షిత మంచినీరు, వైద్య సేవలు ఇలా అన్నింటా వెనుకబాటే. ఆఖరికి డయేరియా, మలేరియా వంటి చిన్న వ్యాధులతో అక్కడి వారు మరణిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చి ఉత్తరాంధ్ర తలెత్తుకునేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. అందుకే థర్మల్ విద్యుత్ ప్లాంట్, అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించదలచారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 

చెప్పుడు మాటల ప్రభావమో..లేక మరే కారణమో తెలియదు కానీ ఆ ప్రాంతపు రైతులు ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. అమరావతిలో అమలు చేసిన ల్యాండ్‌పూలింగ్ అమలు చేసి అన్యాయం జరగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికి వారి వైఖరిలో మార్పు లేదు. ఈ విధానం వల్ల మీరు నష్టపోతారని..అలా కాకుండా భూసేకరణ చట్టం అమలు చేస్తే నాలుగు రెట్ల నష్టపరిహారం లభిస్తుందని కొన్ని శక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ప్రచారం కూడా రైతుల మదిలో బలంగా నాటుకుపోయింది. ఇది అసలుకే మోసం తెచ్చి అభివృద్దిని అడ్డుకుంటోంది. ఒత్తి రగిలితేనే వెలుతురు..నూనె ఇంకితేనే వెలుతురు..ప్రమిద కాలితేనే వెలుతురు లేదంటే మిగిలేది చీకటే..!
 

By
en-us Political News

  
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.