కాల్‌మనీ కథలు-2 - కాల్‌మనీ వెనుక ‘కాలామనీ’!

Publish Date:Dec 17, 2015

Advertisement



కాల్‌మనీ... ఒక్కో వ్యక్తి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్వహిస్తు్న్న ఘరానా వడ్డీ వ్యాపారం. పది రూపాయల ‘ధర్మవడ్డీ’తో నిర్దాక్షిణ్యంగా నిర్వహిస్తున్న వ్యాపారం. డబ్బు అవసరం వున్నవారి బలహీనతను ‘క్యాష్’ చేసుకోవడానికి బడాబాబులు ఎంచుకున్న ఒక మార్గం. వడ్డీతో ఆగకుండా అసలుకూ ఎసరు పెట్టే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ఈ వ్యాపారాన్ని బూతు స్థాయికి దిగజార్చిన ఘనులు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. మొన్నటి వరకు రూపాయికి కూడా ఠికానా లేని విజయవాడ కాల్‌మనీ వ్యాపార ప్రముఖులు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. నిన్నమొన్నటి వరకు కనకదుర్గ గుడిలో చెప్పుల స్టాండ్ నిర్వహించుకుంటూ, బంతిపూలు అమ్ముకుంటూ పొట్టపోసుకున్న వ్యక్తి ఇప్పుడు కాల్‌మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ కోట్లకు పగడలెత్తాడు. అక్కడితో ఆగాడా... ప్రజా ప్రతినిధి కూడా అయిపోయాడు. మరి కాల్‌మనీ వ్యాపారంలో ముదిరిపోయిన ఇలాంటి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?

కాల్‌మనీ వ్యాపారంలో వినియోగిస్తున్న డబ్బంతా బ్లాక్ మనీనే. లెక్కాపత్రం లేని డబ్బే. సీమాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణాజిల్లా పరిసరాల్లో బడాబాబుల దగ్గర డబ్బుకు లోటు లేదు. అయితే ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి సరైన అవకాశాలే లేవు. బ్యాంకులో వేస్తే సవాలక్ష లెక్కలు చెప్పాలి. బ్యాంకు వాళ్ళు ఇచ్చే వడ్డీ చూస్తే విరక్తి కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు చాలా తక్కువ. అందుకే చాలామంది డబ్బున్నవాళ్ళు కాల్‌మనీ వ్యాపారులకు తమ దగ్గర వున్న డబ్బును ఇస్తున్నారు. ప్రతిఫలంగా మూడు రూపాయల వడ్డీ పుచ్చుకుంటున్నారు. కాల్‌మనీ వ్యాపారులు ఆ డబ్బును తీసుకునేవారి అవసరం తీవ్రతను బట్టి మూడు నుంచి ఆరు రూపాయల వడ్డీకి తిప్పుతున్నారు. ఒక్క విజయవాడలోనే యాభైమందికి పైగా కాల్‌మనీ వ్యాపారులు వున్నారు. వారిలో 20 మంది ఈ వ్యాపారంలో బాగా ముదిరిపోయారు. ఈ వ్యవహారంలో దొరికిపోయిన ఒక ఎమ్మెల్యే కాల్‌మనీ వ్యాపారంలో వందకోట్లు తిప్పుతుంటే, మరో ఎమ్మెల్సీ కూడా వందకోట్లతో ఎంచక్కా వ్యాపారం చేస్తున్నాడు. ఒక్క విజయవాడలోనే ప్రతి ఏడా 15 వందల కోట్ల టర్నోవర్‌తో కాల్‌మనీ వ్యాపారం వర్ధిల్లుతోందంటే ఈ వ్యాపారం ఎంతలా వేళ్ళూనుకునిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వ్యాపారం జరిగినా ప్రభుత్వానికి పన్నురూపంలో ఏమైనా ఆదాయం అభిస్తోందా అంటే... అదీ లేదు.. పెట్టుబడి, ఆదాయం... అంతా నల్ల డబ్బే...

కాల్‌మనీ కాలామనీ వ్యాపారంలో నల్లడబ్బు వున్న అనేకమంది పెట్టుబడులు పెట్టారు. ఒక మోస్తరు భూస్వాముల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకూ ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ ఆదాయంలో చాలాభాగాన్ని ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం బయటపడి రచ్చ కావడంతో వాళ్ళు తమ పెట్టుబడులు తిరిగి రాకపోతే పోయె... ఈ ఇష్యూలో తమ పేరు వున్నట్టు బయట పడకూడదని గుర్తొచ్చిన దేవుడికల్లా మొక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక మంత్రిగారికి కూడా ఈ కాల్‌మనీ వ్యాపారులతో సంబంధ బాంధవ్యాలు వున్నట్టు తెలుస్తోంది. ఏ ఇష్యూ జరిగినా మీడియా ముందుకు వచ్చేసి గంటలు గంటలు మాట్లాడే ఆ మంత్రిగారు కాల్‌మనీ వ్యవహారం గురించి ఈ స్థాయిలో రచ్చరచ్చ అవుతున్నా ఎంతమాత్రం స్పందించలేదు. ఎందుకంటే పాపం ఆయన సన్నిహితులే ఈ వ్యాపారంలో వున్నారు. ఆయనేం మాట్లాడగలడు?

(కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.