అందుకే వైకాపాలో చేరారుట!

Publish Date:Jun 7, 2015

Advertisement

 

ఈరోజు వైకాపాలో చేరిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైసీపీలోకి చేరామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఆమె తెలిపారు. అయితే బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం ఖాయం అయిన తరువాత తాము కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడవలసివస్తోందో స్వయంగా బయటపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏడాది పాటు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఏ మాత్రం మెరుగుదల కనబడటంలేదని, కనుకనే పార్టీని వీడవలసివస్తోంది తప్ప పార్టీవల్ల తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా అంధకారంగా కనబడుతున్నందున అటువంటి పార్టీని పట్టుకొని ఇంకా వ్రేలాడటం వలన తమ రాజకీయ భవిష్యత్ కూడా దెబ్బ తింటుందనే ఆలోచనతోనే బొత్స సత్యనారాయణ సకుటుంబ సపరివారంగా సమేతంగా వైకాపాలో చేరిపోయి తమ దారి తాము చూసుకొన్నారనే విషయం స్పష్టమవుతోంది.

 

అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకులు ఏవిధంగా ప్రవర్తిస్తారో బొత్స సత్యనారాయణ కూడా సరిగ్గా అదేవిధంగా వ్యవహరించారని ప్రజలు అభిప్రాయపడితే అందులో అసహజమేమీ లేదు. పదవీ, అధికారాలే ప్రాతిపదికన చూసుకొన్నట్లయితే, బొత్స సత్యనారాయణ చాలా సరయిన నిర్ణయమే తీసుకొన్నారని భావించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైకాపాలో చేరామని చెప్పుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెస్ టోపీ, కండువా రెండూ పక్కన పడేసి, ఆయన ఇప్పుడు వైకాపా కండువా కప్పుకొన్నారు కనుక ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని చెప్పడం సహజమే. కానీ ఇంతవరకు తనను అందలం ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు దానిని ఆదుకొని దాని రుణం తీర్చుకోకుండా వదిలిపెట్టి బయటకి వచ్చిన వ్యక్తి, వైకాపాకు మాత్రం ఏదో ఒరగబెడతారని లేదా మళ్ళీ ఎన్నికల ముందు పార్టీ మారబోరనే నమ్మకం ఏమిటి? అనే సందేహం కలుగకమానదు.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుదామని ప్రయత్నించి విఫలమయిన తరువాత వేరే గత్యంతరం లేకనే ఆయన వైకాపాలో చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఆయనకే బీజేపీలో చేరే అవకాశం కలిగి ఉంటే, బహుశః అప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడేవారేమో? కానీ ఇప్పుడు వైకాపాలో చేరడం వలన ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా తెదేపా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెపుతున్నారనుకోవలసి ఉంటుంది అంతే.

 

ఇప్పుడు రాజకీయాలలో ప్రతీ పనికి, ప్రతీ మాటకి ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. కనుక రాజకీయ నేతలు పార్టీలు మారినప్పుడు పలకవలసిన ఇటువంటి కొన్ని పడికట్టుపదాలను పలుకుతుంటారు. అది విని ప్రజలు నవ్వుకొంటారు. నవ్వితే నవ్విపోయెదురు గాక మాకేటి సిగ్గు? అని నేతలు తమ పని తాము చేసుకుపోతుంటారు. పదవి, అధికారం అనే రెంటికి తప్ప మరే సిద్దాంతాలను నమ్మని అటువంటి వ్యక్తులతోనే మన రాజకీయ వ్యవస్థ నిండి ఉంది. కనుక రాజకీయపార్టీలు కూడా వారిలో నుండే తమకు అవసరమయిన వ్యక్తిని ఎంచుకోవలసి ఉంటుంది. కనుకనే వైకాపా ఆయనను పార్టీలోకి ఆహ్వానించిందని భావించవచ్చును. కనుక వైకాపా వలన బొత్స సత్యనారాయణ లబ్ది పొందుతారా? లేక ఆయన వలన వైకాపా జిల్లాలో బలపడి లబ్ది పొందుతుందా? అనేది మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఆ సంగతి రానున్న నాలుగేళ్ల కాలంలో తేలిపోతుంది.

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.