అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా హల్ చల్: చాకచక్యంగా బంధించిన స్నేక్ క్యాచర్.!
Publish Date:Nov 17, 2026
Advertisement
మామూలుగా ఓ జెర్రిగొడ్డునో, నీరుకట్ట పామునో చూస్తేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఏకంగా 12 అడుగులకు పైగా పొడవున్న తాచుపాము, అదే కింగ్ కోబ్రాను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. సరిగ్గా అటువంటి భయానక అనుభవం అనకాపల్లి మండలం కేజేపురం వాసులకు ఎదురైంది. అనకాపల్లి జిల్లా కేజే పురం మసీదు కాలనీలోదాదాపు 13 అడుగుల పొడవున్న గిరినాగు (కింగ్ కోబ్రా) హల్ చల్ చేసింది. అందరి ముందూ అది సంచరిస్తూ జనాలను వణికించేసింది. దానిని చూసిన వారం భయంతో పరుగులు తీశారు. ఆ 13 అడుగుల కింగ్ కోబ్రా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ప్రవేశించి నచ్చింది. విషయం తెలిసన క్షణాల్లో గ్రామ జనం భయంతో వణికిపోయారు. స్థానికులు స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం అందించారు. దీంతో స్నేక్ కాచర్ బృందం ఎలాంటి జాగు లేకుండా అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. కింగ్ కోబ్రా కదలికలు గమనిస్తూ, ప్రజలకు, అలాగే ఆ పాముకు ఎటువంటి ప్రమాదం లేకుండా బంధించారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కాగా భారీ తాచుపాము వార్త వినగానే పెద్ద సంఖ్యలో జనం ఆ ప్రాంతానికి చేరుకుని స్నేక్ క్యాచర్ బృందం ఆ పామును బంధించిన తీరును గమనించారు. స్నేక్ క్యాచర్ బృందం తమ అనుభవాన్నంతా రంగరించి ఆ భారీ తాచుపామును బంధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్ప జాతులలో ఒకటైన గిరినాగును ప్రాణాపాయం లేకుండా బంధించడంతో స్థానికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అడవులకు ఆనుకుని ఉండే గ్రామీణ ప్రాంతాలలో అప్పుడప్పుడు ఇటువంటి అరుదైన, ప్రమాదకరమైన వన్యప్రాణులు నివాస ప్రాంతాల వైపు రావడం సర్వసాధారణమే. ఆహారం లేదా నీటి కోసం లేదా నివాస స్థావరాల విస్తరణ కారణంగా ఇవి జనావాసాల్లోకి వస్తాయని అంటున్నారు. ఇది కూడా చదవండి: పుష్కర స్నానం చేస్తుండగా..పాము కాటు ఈ పాము కూడా అలాగే వచ్చి ఉంటుందంటున్నారు. ప్రజలకు, పాముకు ఎలాంటి హానీ జరగకుండా భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసిన స్నేక్ క్యాచర్ బృందాన్ని ప్రజలు అభినందించారు. మానవ సంచారానికి దూరంగా ఆ పామును తిరిగి దాని సహజ ఆవాసంలోకి చేర్చడంతో అందరూ హమ్మయ్యా అనుకూన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైనప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాములకు హాని కలగకుండా, అటవీశాఖ సిబ్బందికి లేదా నిపుణులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. మీకు నచ్చవచ్చు: పాము విషంతో నొప్పి మాయం తిరుమలలో తాచుపాము హల్ చల్.. కొత్త సంవత్సరంలో కంగారుపెట్టిన సర్పం [13Feet KingCobra, Anakapallidistrict, Snakerescue, APwildlife, TeluguOne]
http://www.teluguone.com/news/content/13feet-kingcobra-43-237274.html
The All-India Motor Transport Congress has threatened
Defence Minister A. K. Antony and Union Minister
Prime Minister Manmohan Singh and party chief Sonia Gandhi





