ఏపీ స్థానిక సమరం: వైసీపీకి దిమ్మతిరిగే పరిణామాలు.. ఎనిమిది మునిసిపాలిటీలు ఏకగ్రీవం.?

Publish Date:Oct 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల  ఎన్నికలకు సంబంధించి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.   విశ్వసనీయ సమాచారం,  రాజకీయ విశ్లేషణల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 8 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహాలు ప్రతివ్యూహాలు తార స్థాయికి చేరిన తరుణంలో, కొన్ని ప్రత్యేక స్థానాల్లో పోటీ లేకుండానే చైర్‌పర్సన్ పీఠాలు దక్కించుకునేందుకు పావులు కదులుతున్నాయి. ఈ ఏకగ్రీవాలన్నీ అధికార తెలుగుదేశం కూటమికి అనుకూలంగానే జరగడం గమనార్హం. ప్రతి స్థానంలోనూ గట్టిపోటీ ఇస్తాం.. ఏకగ్రీవాలకు అవకాశం ఈయం అంటూ వైసీపీ అధినేత జగన్ పదేపదే ప్రకటించడమే కాకుండా.. ఏకగ్రీవాలను అవకాశం ఇస్తే.. ఆయా నియోజకవర్గాల ఇన్ చార్జీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు ఉండవు అని హెచ్చరించిన తరువాత కూడా ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగడం వైసీపీ దయనీయ పరిస్థితిని అద్దంపడుతోందంటున్నారు విశ్లేషకులు.  

 ఈ ఏకగ్రీవాల అంశంపై అటు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం క్షేత్రస్థాయిలో తమ పట్టును నిలుపుకునేందుకు చివరి నిమిషం వరకు గట్టి ప్రయత్నాలు చేశాయి.  ఇప్పటికే జమ్మలమడుగు, రాయచోటి మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, పుంగనూరు సహా మరో ఐదు నియోజకవర్గాలు కూడా అదే దారిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

[AP Municipal Elections, Andhrapradesh, Unanimous,Eight Municipalities,  Andhra Pradesh News, Telugu One]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.