రాబోయే కాలంలో కాబోయే హోంమంత్రిని: అంబటి ప్రకటన.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజనులు.!

Publish Date:Oct 19, 2026

Advertisement

జగన్ హయాంలో  ఆయన కేబినెట్ లో పని చేసిన  మంత్రులందరూ పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి వినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ పరాజయం  వారు ఐదేళ్ల పాటు అందించిన పాలనా తీరుకు అద్దంపుడుతుందనడంలో సందేహం లేదు.  జగన్ కేబినెట్ లో అంబటి రాంబాబు ఒకరు.  జగన్ హయాంలో అంబటి  నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆ పదవిలో ఉన్నప్పుడు, కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి కనీస సమాచారం కూడా చెప్పలేకపోయారంటే, అప్పటి పాలన తీరు, అంబటి వ్యవహారశైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధమౌతుంది. అంబటి అప్పట్లో తన శాఖకు సంబంధించి విషయపరిజ్ణానంలేకపోవడం ద్వారానే కాదు..  నిరంతరం చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ని దూషించడం ద్వారా కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అపఖ్యాతి పాలయ్యారు. పాలయ్యారు. ఇది స్వయంగా ఆయనకే కాదు.. వైసీపీకి కూడా తీరని నష్టాన్ని చేకూర్చి పెట్టింది.  

 అటువంటి అంబటి ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక తాను  హోం మంత్రిగా ఉంటానని బాహాటంగా ప్రకటించారు. ఆయన ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇరిగేషన్ మంత్రిగా పోలవరం ప్రాజెక్టు ఏమిటో నాకు  అర్ధం కాదని బాహాటంగా చెప్పిన ఆయన ఇప్పుడు.. 2029 ఎన్నికలలో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయితే.. తాను హోంమంత్రిని అవుతానంటూ చేసిన ప్రకటన అంబటి అవగాహనారాహిత్యానికి, రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆయన రాజకీయ అపరిపక్వత, అవగాహనా రాహిత్యాన్ని పక్కన పెడితే.. అంబటి తనను తాను కాబోయే హోంమంత్రిగా ప్రకటించుకోవడం వైసీపీకి స్థానిక ఎన్నికల వేళ ప్రతికూలతకు కారణమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇరిగేషన్ మంత్రిగా వెలగబెట్టింది చాలకనా, నిత్యం దూషణల పర్వంతో చెలరేగిపోయే అంబటి ఇప్పుడు పోలీసు మంత్రిని అవుతానంటూ చెప్పుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. కానీ అంబటి రాంబాబు వంటి వారు, తాము మళ్లీ హోం మంత్రి పదవిలోకి వస్తానంటూ ప్రకటించుకోవడం పార్టీకి ప్రతికూలంగా మారడం తథ్యమని నెటిజనులు అంటున్నారు. పైగా అంబటి రాంబాబు ప్రకటన ఆయనలో ఉన్న అధికార దాహాన్ని బయటపెట్టిందని చెబుతున్నారు.  


[Ambati Rambabu Home Minister Comments, YCP, Andhra Pradesh Politics, Local Body, Elections, dverse, Conditions, Telugu One]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.