చంద్రబాబు మరో కొత్త ప్రయోగం, సరికొత్త రికార్డు

Publish Date:Dec 14, 2014

Advertisement

 

దేశంలో మొట్ట మొదటి సారిగా కాగితం లేకుండా ఐ-ప్యాడ్ లతో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గూగూల్ హాంగ్ అవుట్స్ ద్వారా ప్రజలతో మాట్లాడబోతున్నారు.

 

ఈనెల 20వ తేదీన సాయంత్రం ఆరు నుండి ఏడూ వరకు గంటసేపు సాగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. ఇందుకుగాను ఆసక్తిగలవారు ముందుగా తమ ప్రశ్నలను ఫేస్ బుక్, ట్వీటర్ లేదా గూగూల్ హ్యాంగ్ అవుట్స్ లలో #ఆస్క్ ఏపీ సియం లేదా #ఆస్క్ సిబియన్ (#AskAPCM or #AskCBN) లద్వారా అడగవచ్చును. ఈసారి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉన్నత విద్య అనే రెండు అంశాల మీద ప్రశ్నలు అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి సమాధానాలు రాబట్టుకావచ్చును. అయితే ఈ కార్యక్రమం కేవలం ఒక గంట సేపు మాత్రమే సాగుతుంది కనుక కేవలం 15మంది మాత్రమే ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ప్రశ్నలు పోస్ట్ చేసినవారందరితో ఆయన స్వయంగా మాట్లాడలేకపోయినా వారికి ఆయన సమాధానాలు వెళతాయి.

 

ఇప్పటికే దీని గురించి ఫేస్ బుక్, ట్వీటర్ గూగల్ , రాజకీయ వెబ్ సైట్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించదలచిన వారు తక్షణమే తమ ప్రశ్నలను పోస్ట్ చేయవచ్చును.

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.