ఆంధ్రప్రదేశ్ లో కొత్త పర్యాటక శోభ.. పది ప్రాంతాలలో సీప్లేన్ లు.!

Publish Date:Sep 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  సరి కొత్త పర్యాటక శోభకు తెరలేచింది. రాష్ట్ర  పర్యాటక రంగంలో  కొత్త శకం ఆరంభం అయ్యేందుకు తెర లేచింది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను జల మార్గాల ద్వారా అనుసంధానించే   సీ ప్లేన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కైహోప్‌ ఏవియేషన్, మారిటైం ఎనర్జీ హెలి ఎయిర్‌ సర్వీసెస్‌   సంస్థలు ముందుకు రాగా, కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు అఫీషియల్ గా ఆమోదముద్ర వేసింది.  పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10  పర్యాటక ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి  వస్తాయి. ఈ సరికొత్త రవాణా విధానం వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. 

ఎంపిక చేసిన ఈ పది ప్రాంతాల్లోనూ ప్రయాణికుల రాకపోకల కోసం వాటర్‌డ్రోమ్‌లు అంటే  మినీ విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ   ఆధ్వర్యంలో త్వరలోనే వీటికి   టెండర్లు పిలువనున్నారు. ఒక్కో వాటర్‌డ్రోమ్‌ నిర్మాణానికి అంచనా   వ్యయం  20 కోట్ల రూపాయలు.  

విజయవాడలోని బెర్మ్ పార్క్, ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం, తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం, తిరుపతిలోని రాయలచెరువు, సూర్యలంక, చారిత్రక గండికోట, కాకినాడ, అరకులోని జోలాపుట్, లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్,  పోలవరం ప్రాంతాలలో ఈ సీ ప్లేన్ సేవలు దశలవారీగా ప్రారంభం కానున్నాయి. గతంలో విజయవాడలోని బెర్మ్ పార్కు నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన ట్రయల్ రన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సీ ప్లేన్‌లో ప్రయాణించి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన  ఉడాన్  పథకం కింద   ఆర్థిక చేయూత అందిస్తోంది. ప్రయాణికుల నుంచి పూర్తి స్థాయి ఆదరణ లభించే వరకు ఆపరేటర్లకు  నష్టాలు వస్తే వాటిని భర్తీ చేసేందుకు లోటు భర్తీ నిధి  కింద సాయం అందనుంది. దేశంలో ఇప్పటికే గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఉడాన్ పథకం కింద సీ ప్లేన్ సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయి.  ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా   చేరుతోంది. ఈ వాటర్‌డ్రోమ్‌లను కేవలం సీ ప్లేన్ల రాకపోకలకే కాకుండా, స్థానికంగా పర్యాటకుల కోసం నడిచే ఇతర బోటింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడేలా   డిజైన్ చేస్తున్నారు. ఈ వినూత్న సేవలు అందుబాటులోకి వస్తే ఏపీకి వచ్చే దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి, స్థానిక ఉపాధి అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతాయని పర్యాటక శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


[New Era In Andhra Pradesh tourism, AP seaplane services, UDAN scheme AP, waterdromes in AP, Vijayawada Srisailam seaplane, APTDC tourism projects, Telugu One]

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.