కాంగ్రెస్ కపట నాటకాలు నమ్మేదెవరు?

Publish Date:Feb 23, 2015

Advertisement

 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు చూస్తుంటే, ఇంత నీచమైన పార్టీనా దేశ ప్రజలు ఇంతకాలం గద్దె మీద కూర్చోబెట్టిందనే ఆవేదన కలుగుతోంది. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మీద ప్రజలకు కలగనంత అసహ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు దేశ ప్రజలకు కలుగుతోంది. అందుకే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. మొన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అయిపోయిందనే అంశానికి పూర్తి స్పష్టత ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం బుద్ధి రాలేదు.. తన కపట నాటకాలు మానడం లేదు... ఆ కపట నాటకాలకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు.

 

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో లేని విధంగా అత్యంత దుర్మార్గంగా విభజించింది. మాజీ కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకరరెడ్డి చెప్పినట్టు.. దుర్మార్గులందరూ చుట్టూ చేరి అభిమన్యుడిని ఎలా చంపేశారో... కాంగ్రెస్ పార్టీలోని దుష్టగ్రహాలన్నీ చేరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అలా చంపేశాయి. సదరు గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకునే పెద్ద గ్రహం సోనియాగాంధీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లేనిపోని ప్రేమ ఒలకబోయటం ఆ పార్టీ గుంటనక్క వైఖరికి ఒక పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ అలసత్వంగా వ్యవహరిస్తోందట. అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో బీజేపీని నిలదీస్తుందట... ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలాంటి ఎన్ని కపట నాటకాలు ఆడినా లాభం లేదు. ఇలాంటి నాటకాలతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఏహ్య భావాన్ని చిటికెడు కూడా తగ్గించలేదు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు... విభజన చట్టంలోని ఇతర హామీల విషయంలో కావచ్చు.. ఇలాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ నమ్మకం వుంది. ఆయన త్వరలోనే ఇవన్నీ సాధించగలరని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆయన కూడా తనవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పానకంలో పుడకలాగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్‌ని ఏదో ఉద్ధరించబోతున్నట్టు నానా కంగాళీ చేయడం వల్ల జరిగేది చెడే తప్ప మంచి కాదు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి చేసిన చెడు చాలు... ఇప్పటికైనా తన కపట నాటకాలను ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆడటం మానుకోవాలి.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.