కేబినెట్ బెర్త్‌పై గుంటూరు నేతల కన్ను

Publish Date:Apr 11, 2016

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో  తనయుడు లోకేష్, బావమరిది బాలయ్యలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ రోజుకోక వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ అటు మీడియాలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మంత్రివర్గంలో మార్పులేంటి? చేర్పులేంటి? ఎవర్ని ఉంచుతున్నారు? ఎవర్ని ఊడబీకుతున్నారో తెలియక పచ్చ కండువాలు జుట్టుపీక్కుంటున్నాయి. ఇవన్నీ అటుంచితే తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలంటూ చాలా మంది ఆశావహులు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరిలో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు రేసులో ముందున్నారు. తొలి విడతలో తమకు అవకాశం రాకపోవడం, కొత్తగా వైసీపీ నుంచి వలసలు రావడంతో ఈసారైనా చంద్రబాబు తమను కరుణిస్తారో లేదోనన్న అనుమానంతో ఎలాగైనా మంత్రిగా ప్రమాణం చేయాలని చూస్తున్నారు గుంటూరు నేతలు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్ర రాజకీయాల్లోనూ గుంటూరు గడ్డది కీరోల్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ 12 స్థానాలు కైవసం చేసుకుని టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచింది ఈ జిల్లా. జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు మంత్రులుగా , కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా ఇంతవరకు అమాత్య పదవి దక్కించుకోని ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు ఈసారి ఎలాగైనా బుగ్గకారు ఎక్కాలని డిసైడ్ అయ్యారు. అందుకనే ఎవరి స్టైల్లో వారు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం, ఇంతవరకు మంత్రిగా అవకాశం రాకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటైన జవాబివ్వడం ద్వారా థూళిపాళ్ల బాబు వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఈ కారణాలతో ఈసారి ఆయనకి కేబిన్‌ట్‌లో బెర్త్ కన్ఫామ్ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరొ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంగతి చూస్తే తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. కష్టకాలంలో కార్యకర్తలు పార్టీని వదలకుండా కాపాడారు. అందుకే చంద్రబాబు వద్ద తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. మరో సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో వైసీపీని థీటుగా ఎదుర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం ట్రై చేస్తున్న మరో లీడర్ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్. సొంత డబ్బు ఖర్చుపెట్టి మరి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించిన వ్యక్తిగా...పిలిస్తే పలికే నేతగా ప్రజల్లో ఈయన పట్ల సదాభిప్రాయం ఉంది. వీరంతా సీనియర్లు కావడంతో పాటు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు.

 

అయితే ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రత్తిపాటి, రావెల కిశోర్ బాబు పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉండటంతో వీరికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. దీంతో దళితుల కోటాలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌లు విజ్ఞప్తి చేశారు. ఆనందబాబు సీనియర్ అయినప్పటికి అమరావతి ప్రాంతంలో రైతులను ఒప్పించి ల్యాండ్‌పూలింగ్‌కి సహకరించిన శ్రవణ్ కుమార్‌కు రావెల స్థానంలో బెర్త్ దక్కే అవకాశముందని ట్రస్ట్ భవన్ టాక్.  ఇలా ఎవరికి తోచినట్లు వారు  అనాలిసిస్ చేస్తున్నప్పటికి చంద్రబాబు లెక్కలు ఆయనకుంటాయి. ఒకరిని కాదని ఒకరికి మంత్రి పదవి ఇస్తే రాజకీయ రచ్చ తప్పదని..ప్రతిపక్షంలో ఉండగా..పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని వేరే వారికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పార్టీలో కుదుపు ఖాయమని సీఎం భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాను ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.