ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక: విస్తృత తనిఖీలు.!

Publish Date:Nov 11, 2026

Advertisement

ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదరింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ బెదరింపులతో సిబ్బంది అప్రమత్తమై విమానంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, ఆ బెదరింపు ఫేక్ అని నిర్దారించుకుని ఊపిరి పీల్చుకోవడం రివాజుగా మారింది. 

అందుకు భిన్నంగా బుధవారం (నవంబర్ 11)న ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదరింపు వచ్చింది. కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నుంచి ఈ అలర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వచ్చింది. ఈ ఉదంతం కలకలం రేపింది.   కోల్‌కతా విమానాశ్రయంలో టేకాఫ్‌కు సర్వం సిద్ధం చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానంలోని టాయిలెట్‌లోని  ఒక అద్దంపై హైజాక్‌  బెదిరింపు సందేశం రాసి ఉండటాన్ని గుర్తించిన విమాన సిబ్బంది. వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులకు హైజాక్ అలర్ట్ సమాచారం అందించారు. 

స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది తక్షణమే తదుపరి చర్యలు చేపట్టారు. విమానం టేకాఫ్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, భద్రతా చర్యల్లో భాగంగా దానిని ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ఐసోలేషన్‌ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.

ఇది కూడా చదవండి:  ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు: 109 మంది ప్రయాణీకులు సురక్షితం.!

విమానంలో సీఐఎస్‌ఎఫ్  భద్రతా సిబ్బంది  ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన వెనుక అసలు నిజాలు ఏంటనే కోణంలో   ఏజెన్సీలు సంయుష్టంగా దర్యాప్తు జరుపుతున్నారు.

విమానం టాయిలెట్ లో అద్దం మీద బెదరింపు సందేశం రాసిన వ్యక్తులెవరు? వారికి సహకరించిన వారెవరు అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మొత్తం మీద ఇది ఆకతాయి బెదరింపుగా అధికారులు భావిస్తున్నారు.  

మీకు నచ్చవచ్చు: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘హై అలర్ట్’.. అడుగడుగునా నిఘా..!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం: దంపతుల అరెస్టు.!

[Air India Flight High Threat, Hijack Alert, Kolkata Airport, CISF Security Check, Telugu One] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.