ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!

Publish Date:Nov 11, 2026

Advertisement

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత విశేషాలను ప్రతిబింబిస్తూ రాసిన ఆత్మకథ  బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్   544 పేజీల పుస్తకంలో  ఆమె తన వ్యక్తిగత జీవితం, కుటుంబ బంధాలు, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు.

ఆమె జ్ణాపకాలలో రాజీవ్ గాంధీతో తన పరిచయం, ప్రేమ, వివాహం వంటి మధుర స్మృతులే కాకుండా,  ఇటలీలో తన బాల్య జ్ఞాపకాలు, ఆ తరువాత వివాహానంతరం పూర్తిగా భిన్నమైన భారతీయ సంస్కృతికి అలవాటు పడటం, హిందీ నేర్చుకోవడం వంటి అనుభవాలనూ నెమరువేసుకున్నారు.  తొలిసారి భారతీయ వంటకాలు రుచి చూడటం, చీర కట్టుకోవడం వంటి చిన్నచిన్న విషయాలను కూడా ఎంతో హృద్యంగా తన ఆత్మకథలో పొందుపరిచారు.

అలాగే   తన తొలి సంతానాన్ని కోల్పోవడం గురించి కూడా ఆవేదనా భరితంగా రాసుకొచ్చారు. 1969 జనవరిలో నెలలు నిండకముందే జన్మించిన తమ మొదటి మగబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించడంతో తాను, రాజీవ్ గాంధీ  కుంగిపోయామనీ,  ఆ కష్టకాలంలో  తన అత్తగారు తనకు కొండంత అండగా నిలిచారనీ చెప్పుకొచ్చారు.  ఆ పసికందును మెహ్రౌలీలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేసిన విషయాన్నీ పేర్కొన్నారు. 

అలాగే తన తన మరిది సంజయ్ గాంధీ అకాల మృతి, 1984లో ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వంటి విషయాలను కూడా తన ఆత్మకథలో సోనియాగాంధీ విపులంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారు..సోనియా ఆత్మకథలో సంచలన విషయాలు. !

ఇక తన జీవితంలో అత్యంత విషాదఘటన  1991లో జరిగిన రాహుల్ గాంధీ హత్య, ఆయన మరణం తరువాత తన జీవితాన్ని ఎలా మారిందన్న విషయాన్నీ సోనియాగాంధీ ఆత్మకథలో నివేదించారు.  ఆ పెను విషాదం తర్వాత కుటుంబ బాధ్యతలను మోస్తూనే, తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితులనూ వివరించారు. 

ఇక తాను 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడానికి కారణాలను కూడా విపులీకరించారు.  ఆ ఎన్నికల ముందే తాను ఆ పదవిని చేపట్టబోనని పిల్లలకు మాటిచ్చినప్పటికీ, కూటమి విజయం సాధించాక మిత్రపక్షాల నుంచి  వచ్చిన ఒత్తిడి కారణంగా ఒక  దశలో ప్రధాని పదవి చేపట్టేందుకు ఓకే అన్నప్పటికీ,   తనలోని అంతర్గత సంఘర్షణ, పార్టీ పట్ల బాధ్యత,  కుటుంబం ఎ  విషాదాలను బేరీజు వేసుకుని ప్రధాని పదవిని తీసుకోకూడదన్న తన తొలి నిర్ణయానికే కట్టుబడ్డానని సోనియాగాంధీ తన ఆత్మకథలో వివరించారు. 

మీకు నచ్చవచ్చు: రాజీవ్‌కు రాజకీయాలు వద్దన్న సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు మౌనం.?

పౌరసత్వం రాకముందే ఓటు హక్కు పొందారా.. సోనియా గాంధీ కేసులో కొత్త ట్విస్ట్.!

[Sonia Gandhi PM Post Refusal , Belonging A Journey of LoveAutobiography, Rajiv Gandhi Assasination, Sanjay Gandhi Death, Indiragandhi, Family, Politics, Telugu One] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.