అక్టోబర్ 10 నిరసనలకు ముందు: బొద్దింకలకు నోటీసులు.!

Publish Date:Oct 6, 2026

Advertisement

దేశ రాజకీయాల్లో ఎన్నికల సంఘం వ్యవహారంపై జరుగుతున్న చర్చల మధ్య, అక్టోబర్ 10న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన  కొత్త వివాదానికి తెరలేపింది. కాక్‌రోచ్ జనతా పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ కార్యకర్తలకు వివిధ రాష్ట్రాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారనీ, తద్వారా ఢిల్లీ నిరసనలో పాల్గొనకుండా ఒత్తిడి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

దీప్కే ఆరోపణల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లోని కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేసి, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? నిరసన హింసాత్మకంగా మారే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు చెప్పారు. ఈ విధానం ప్రజాస్వామ్య హక్కులపై ఒత్తిడిగా ఆయన అభివర్ణించారు. అభిజీత్ దీప్కే ఆరోపణలపై సంబంధిత పోలీసు విభాగాలు ఇంత వరకూ స్పందించలేదు.  

 ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో  గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పలు సామాజిక సంస్థలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇస్తున్నాయి. ఎన్నికల జాబితాల సవరణ వల్ల కొంతమంది ఓటర్లు జాబితాల నుంచి తొలగించబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడానికే ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది. 

ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఢిల్లీలో భారీ స్థాయిలో యువత, విద్యార్థులతో   నిరసన కు బొద్దింకల పార్టీ  పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం కోసం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని సీజేపీ  చెబుతోంది. ఇలా ఉండగా హస్తినలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆందోళనను అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. 


[CJP October 10 Delhi Protest, Jantar Mantar, Police Notices, Election Commission, CEC Controversy, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.