మూడు వెంట్రుకలు..రూ.3.7 లక్షల ధర.. ఎవరివో తెలిస్తే షాకే.!
Published on: Sun Nov 22, 2026 1:38PM

అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్కు సంబంధించిన అరుదైన జ్ఞాపికలు మరోసారి అంతర్జాతీయ వేలంలో ఆసక్తి రేపుతున్నాయి. సాధారణంగా వెంట్రుకలకు ఎంత విలువ ఉంటుంది? మహా అయితే కొన్ని రూపాయలు. కానీ అమెరికా తొలి అధ్యక్షుడికి చెందిన మూడు వెంట్రుకలు మాత్రం లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. తాజాగా ఆయన వెంట్రుకలకు సంబంధించిన ఓ అరుదైన జ్ఞాపిక వేలంలో 4 వేల డాలర్లు.. అంటే సుమారు రూ.3.7 లక్షలు పలికింది. గతంలో ఇదే తరహాలో మూడు వెంట్రుకలతో కూడిన ఓ లాకెట్ ఏకంగా 40 వేల డాలర్లకు (సుమారు రూ.37 లక్షలు) అమ్ముడవడం విశేషం.
రిచ్మండ్ ఆక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో బంగారు అంచులతో కూడిన ప్రత్యేక ఫ్రేమ్‌లో భద్రపరిచిన వాషింగ్టన్ వెంట్రుకల జ్ఞాపికను వేలానికి ఉంచారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన జాన్ గాడ్స్బై ద్వారా ఈ జ్ఞాపిక తరతరాలుగా వారసుల చేతుల్లోకి చేరినట్లు వేలం నిర్వాహకులు వెల్లడించారు. 1799లో వాషింగ్టన్ మరణించడానికి కొద్దికాలం ముందు వరకు ఆయనతో గాడ్స్బైకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
గాడ్స్బై మనవరాలు జూలియా టెన్ మెక్బ్లెయర్ గతంలో ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ జ్ఞాపికను వారి కుటుంబం ఇంట్లో వాషింగ్టన్ చిత్రపటం కింద ఎంతో భద్రంగా ఉంచేది. అమెరికా స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్.. రాజ్యాంగ రూపకల్పనలోనూ భాగస్వామి అయ్యారు. 1789లో అమెరికా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, రెండు పర్యాయాలు పదవిలో కొనసాగారు. 1797లో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.
ఇది కూడ చదవండి: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.!
గతంలో ఆయన మరణ సమయంలో లేదా ఆ తర్వాత సేకరించిన మూడు వెంట్రుకలతో కూడిన లాకెట్ సుమారు రూ.37 లక్షలు పలకడం చారిత్రక వస్తువుల వేలంలో సంచలనంగా నిలిచింది. తాజాగా జరిగిన వేలంలో జ్ఞాపికను కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
నిజానికి 19వ శతాబ్దంలో ప్రముఖులు, ఆత్మీయులకు చెందిన వెంట్రుకలను లాకెట్లు, ప్రత్యేక ఫ్రేమ్‌లలో భద్రపరచుకోవడం పాశ్చాత్య సమాజంలో ఒక సంప్రదాయంగా ఉండేది. వాషింగ్టన్ నివసించిన మౌంట్ వెర్నన్ నివాసం ప్రస్తుతం మ్యూజియంగా కొనసాగుతోంది. అక్కడ ఆయనకు చెందిన 50కి పైగా వెంట్రుకల నమూనాలు భద్రపరిచినట్లు సమాచారం.

మరోవైపు, వాషింగ్టన్కు సంబంధించిన ఇతర చారిత్రక వస్తువులకూ వేలంలో భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆయన సంతకంతో కూడిన 1776 నాటి ఓ లేఖ ఇటీవల లక్ష డాలర్లకు పైగా ధర పలికింది. దీంతో అమెరికా వ్యవస్థాపకుల జ్ఞాపికలపై కలెక్టర్లు, చరిత్ర ప్రియుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. మొత్తానికి ఒకప్పుడు ఆత్మీయ జ్ఞాపకంగా భద్రపరిచిన వెంట్రుకలు.. ఇప్పుడు లక్షల రూపాయల విలువైన చారిత్రక సంపదగా మారడం విశేషం.
మీకు నచ్చవచ్చు: బంగారం ధరలు భారీ తగ్గుదల.. ప్రధాని మోదీకి సీటీఐ కృతజ్ఞతలు.!
మీకు నచ్చవచ్చు: ఒకే వేదికపై సీఎం విజయ్–సంగీత.. వేర్వేరు ఎంట్రీలతో రిసెప్షన్లో హాట్ టాపిక్.!
[ George Washington, US First President, Washington Hair, Rare Historical Memorabilia, Richmond Auction House, Historical Auction, Mount Vernon, American History, Rare Collectibles, Auction Record ]


