ఒకే వేదికపై సీఎం విజయ్–సంగీత.. వేర్వేరు ఎంట్రీలతో రిసెప్షన్‌లో హాట్ టాపిక్.!
Published on: Sun Nov 22, 2026 11:59AM
.webp)
అనిరుధ్-కావ్య రిసెప్షన్‌లో సీఎం విజయ్ దంపతుల ఎంట్రీపై ఆసక్తికర చర్చ.!
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరియు ఆయన సతీమణి సంగీత వేర్వేరు సమయాల్లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ముందుగా సంప్రదాయ దుస్తుల్లో వేదిక వద్దకు చేరుకున్న సీఎం విజయ్, నూతన వధూవరులు అనిరుధ్, కావ్య మారన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి జంటను అభినందించిన అనంతరం, వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వేడుకలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎంకే స్టాలిన్‌తో ప్రముఖులతో విజయ్ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
విజయ్ వేడుక నుంచి వెళ్లిన కొద్దిసేపటికే సంగీత స్వర్ణలింగం రిసెప్షన్‌కు విచ్చేశారు. పసుపు రంగు చుడీదార్‌లో చిరునవ్వుతో కనిపించిన ఆమె, అతిథులను పలకరిస్తూ సందడి చేశారు. నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి ఫొటోలు దిగారు.
చాలా నెలల విరామం తర్వాత సంగీత బహిరంగ కార్యక్రమంలో కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు, అతిథుల దృష్టి ఆమెపై పడింది. గతంలో తమ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సమయంలో ఆమె కనిపించగా, మళ్లీ ఇప్పుడే ఈ వేడుకలో సందడి చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇది కూడ చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ..31 కంపార్టుమెంట్లు ఫుల్.!
ఇటీవల ఆ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించిన వార్తలు వినిపించిన నేపథ్యంలో, వీరిద్దరూ కలిసి వస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఒకే కార్యక్రమానికి హాజరైనప్పటికీ ఇద్దరూ వేర్వేరుగా రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రి హోదాలో విజయ్ బిజీ షెడ్యూల్‌తో పాటు వ్యక్తిగత పరిణామాల నేపథ్యంలో ఈ వేడుకలో చోటుచేసుకున్న దృశ్యాలు ఆసక్తి రేపుతున్నాయి. రానున్న రోజుల్లో వీరిద్దరి వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చవచ్చు: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.!
మీకు నచ్చవచ్చు: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.!
[ Anirudh Kavya Maran reception, CM Vijay, Sangeetha, Chennai, Chennai Reception, Celebrity News, Tamil Cinema, Viral News ]


