LATEST NEWS
- ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం
- పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
"కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిలకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్చార్జుల శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.
సిద్ధాంతాలే నాయకత్వానికి బలం
“ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు.
ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామస్థాయికి తీసుకెళ్లాలి
“ఎన్ని పనులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు.
పార్టీతో కార్యకర్తలను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్
“ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్యవసరం. రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగత పనులు పూర్తిచేసుకుని కొంత సమయం కేటాయించి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.
రెడ్ బుక్ సమాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం
“గతంలో దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్యకర్తలను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్పడ్డారు. అమర్నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యలను వెంటాడి మరీ చంపారు. డా.సుధాకర్, కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిలను వేధించి మరణానికి కారకులయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం-దాడులు-హత్యలు-అవినీతితో చెలరేగిపోయిన జగన్..అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విషప్రచారాలతో విరుచుకుపడుతున్నాడు. ఐకమత్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ సమాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగన్ అంటూ కలవరిస్తున్నాడు జగన్. ``
నేతల మధ్య సఖ్యత ముఖ్యం
“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకున్నట్టే, కూటమి నేతలు కుటుంబంలా కూర్చొని చర్చించుకుని విభేదాలు విడనాడలి`` అని సూచించారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రచార పర్వాన్ని ఉధృతం చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండదండలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా రెజీనగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏకమయ్యాయని, వాటి కలయిక అపవిత్రమైనదని ఆయన అభివర్ణించారు. సిద్ధాంతాలు లేని ఇటువంటి కూటములు రాష్ట్రంలో అస్థిరతను సృష్టిస్తాయని, ప్రజలు వీటిని నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.
ముఖ్యంగా ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్‌కు సంబంధించిన వివాదాస్పద వీడియో అంశాన్ని అభిషేక్ ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, విపక్ష నేతలు కుమ్మక్కై రాజకీయ డీల్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అభిషేక్ బెనర్జీ ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియా వ్యూహాలను సమర్థవంతంగా వాడుకుంటున్నారు. మమతా బెనర్జీ వారసుడిగా, పార్టీలో రెండో అత్యున్నత నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎన్ఆర్సీ అమలును అడ్డుకోవడంలో దీదీ పోరాటాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, భావోద్వేగపూరిత ప్రసంగాలతో యువతను ఆకర్షిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీ నాయకత్వ పటిమకు ఒక పెద్ద పరీక్ష వంటివి. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుంటూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయన వేస్తున్న అడుగులు టీఎంసీకి కలిసి వస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, అభివృద్ధి మంత్రంతో ప్రజల వద్దకు వెళ్తున్న అభిషేక్ బెనర్జీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఏదేమైనా, బెంగాల్ పీఠంపై మరోసారి తృణమూల్ జెండా ఎగురుతుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అగ్నిగుండంగా మారింది. మాజీ సీఎం జగన్ తాజాగా తెరపైకి తెచ్చిన మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన పెను సంచలనానికి దారితీసింది. అయితే, ఈ ప్రతిపాదన పట్ల జనం నుంచి ఇసుమంతైనా సానుకూలత వ్యక్తం కాలేదు. సానుకూలత సంగతి అటుంచి, ప్రతికూలత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యింది. జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ మంత్రులు జగన్ తీరును తప్పుబడుతూ గళమెత్తడం పార్టీ అసంతృప్తి, అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసిందంటున్నారు పరిశీలకులు.
జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతుండగా, మళ్లీ కొత్త ప్రాంతాలను తెరపైకి తెచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నారంటూ జగన్ ను నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు, మాజీ మంత్రులు ఈ విషయంలో జగన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంశాలను తాము సమర్థించలేమని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంటున్నారు. గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కేడర్ ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు మావిగన్ అంటే ఇక ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిన తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు పార్టీకి తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ ప్రతిపాదనపై అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి. జగన్ మావిగన్ నినాదంతోనే ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతే కాకుండా, పార్టీలో అసమ్మతి కూడా పీక్స్ కు చేరు అవకాశం ఉందని అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
- రిస్కీ స్టంట్స్ వెనుక అసలు రహస్యం
- నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ యాక్షన్
- 'అతనొక్కడే' మాస్ ఎలివేషన్ వీడియో వైరల్!
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ఒకటైన 'అతనొక్కడే' లోని హై-వోల్టేజ్ ఛేజింగ్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన వీడియో ఇది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కళ్యాణ్‌రామ్ కెరీర్‌కి చక్కని పునాది అయింది. ఆరోజుల్లో ఇది ఓ ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటికీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు చూస్తుంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎందుకు అంతటి విజయాన్ని సాధించిందో అర్థమవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టంట్ మాస్టర్లు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా రిస్కీ స్టంట్స్ స్వయంగా చేయడం విశేషం. యాక్షన్ సన్నివేశాల ప్రిపరేషన్ కోసం షూటింగ్‌కు ముందే ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
వీడియోలో ప్రధానంగా కనిపించే బైక్ ఛేజింగ్ సీన్ సినిమాకే హైలైట్. రద్దీగా ఉండే రోడ్లపై కళ్యాణ్ రామ్ బైక్‌పై దూసుకెళ్తూ, విలన్లను వేటాడే విధానం అత్యంత ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆ బైక్ స్కిడ్డింగ్ మరియు టర్నింగ్స్ చేసే సమయంలో హీరో చూపించిన ఏకాగ్రత అమోఘం. విలన్ల వాహనాన్ని అడ్డగించే క్రమంలో జరిగే కారు బోల్తా సీన్లు హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి.
ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విలన్‌ను కాల్చే సీన్ మాస్ ప్రేక్షకులకు అసలైన విందు. హెల్మెట్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని విలన్ని వెంటాడుతూ ఓ బ్రడ్జిపై నుంచి ఎగిరి గాల్లోనే ఆ విలన్ తల నరకడం వంటి సీన్స్ అప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదనే చెప్పాలి. ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆరోజుల్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. యాక్షన్ సీన్లలో కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ మరియు గంభీరమైన చూపులు ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. స్టంట్ మాస్టర్ల నేతృత్వంలో ప్రాణాలకు తెగించి చేసిన ఈ పోరాట దృశ్యాలు నేటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ఈ వీడియో చూసిన అభిమానులు కళ్యాణ్ రామ్ డెడికేషన్‌ను కొనియాడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన నుండి ఇటువంటి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ రావాలని కోరుకుంటున్నారు. 'అతనొక్కడే' లాంటి కల్ట్ క్లాసిక్ యాక్షన్ మూవీస్ ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోతాయి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
- సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోటాపోటీ ఫిర్యాదులు!
- మంగ్లీ తమ్ముడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో వైరల్..
- 'గిరిజన కార్డు'పై నెటిజన్ల ఫైర్!
ప్రముఖ జానపద గాయని మంగ్లీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే ఇది ఆమె పాటల కోసం కాదు, ఒక భారీ ఆర్థిక వివాదం కారణంగా! దాదాపు 180 నుంచి 200 కోట్ల రూపాయల వరకు క్రౌడ్ ఫండింగ్ పేరుతో వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఎంత? అసలు అడ్వకేట్ సుబ్బు చేస్తున్న ఆరోపణలేంటి? అనే విషయాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా మంగ్లీ తమ్ముడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కట్టల కొద్దీ నోట్లను మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు ఉండటంతో ఈ స్కామ్ డెప్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బిజినెస్ నెట్‌వర్క్‌లో మంగ్లీ ఇమేజ్ను వాడుకుని సామాన్యుల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించారనేది ప్రధాన ఆరోపణ. మ్యూచువల్ ఫండ్ తరహాలో లాభాలు వస్తాయని నమ్మించి, తీరా సమయం వచ్చాక చేతులెత్తేయడంతో బాధితులు లాయర్లను ఆశ్రయించారు.
ఈ ఇష్యూపై మంగ్లీ కూడా గట్టిగానే స్పందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆమె, తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను ఒక గిరిజన మహిళనని, తన ఎదుగుదల చూడలేక కొందరు టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ గిరిజన కార్డును వాడుకోవడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. క్రైమ్ జరిగినప్పుడు సామాజిక నేపథ్యంతో సంబంధం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, ఈ కేసును డీల్ చేస్తున్న అడ్వకేట్ సుబ్బు తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన పబ్లిసిటీ కోసమే సెలబ్రిటీల పేర్లను బయటకు లాగుతున్నారని మంగ్లీ వర్గం అంటోంది. ఈ వివాదంలోకి దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా రావడం విశేషం. కేవలం పరిచయాల రీత్యా జరిగిన సహాయాన్ని కూడా స్కామ్‌తో ముడిపెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో విచారణ వేగవంతమైంది. నిజంగానే మంగ్లీ కుటుంబ సభ్యులు ఈ వసూళ్లకు పాల్పడ్డారా? లేక ఆమెకు తెలియకుండానే ఆమె పేరును వాడుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. సెలబ్రిటీలు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేదా వ్యాపారాల్లో భాగస్వాములయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు ఈ విషయంలో ఒక స్పష్టత రాకపోవచ్చు. అంతవరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను గుడ్డిగా నమ్మలేమని, చట్టపరమైన విచారణ తర్వాతే అసలు నిజాలు బయటపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌ను టాలీవుడ్లో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన నటించిన పవర్ ఫుల్ సినిమాల్లో 'సీమ సింహం' (Seema Simham) ఒకటి. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ పవర్ఫుల్ మాస్ సినిమాలోని ఒక ఐకానిక్ సీన్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
గడగడలాడించే గంభీర స్వరం.. 'దుర్గా ప్రసాద్' విశ్వరూపం
ఈ వైరల్ వీడియోలో బాలయ్య తనలోని అసలైన మాస్ యాంగిల్‌ను ఆవిష్కరించారు. ముఖ్యంగా నిశ్చితార్థం జరిగే సమయంలో వచ్చే ఈ సీన్ సినిమాకే హైలైట్. సీమ ఫ్యాక్షనిస్టుల మధ్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య తన ఇంటెన్సిటీని చూపించిన తీరు అద్భుతం. తన కంటిచూపుతోనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే 'దుర్గా ప్రసాద్'గా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వైరల్ అవుతున్న పవర్ఫుల్ డైలాగ్స్
బాలయ్య సినిమాల్లో యాక్షన్ ఎంత ముఖ్యమో, ఆయన చెప్పే డైలాగ్స్ కూడా అంతే ముఖ్యం. 'సీమ సింహం'లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంటాయి. ముఖ్యంగా "ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయ్.. లేకపోతే నేను ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా!" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆయనలోని గంభీరత్వాన్ని, పాత్రలోని పవర్‌ను చాటిచెబుతుంది. తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా ఫ్యాక్షనిస్టులను, బడా నేతలను గడగడలాడించే ఎస్పీ దుర్గా ప్రసాద్‌గా ఆయన ఈ వీడియోలో మనకు కనిపిస్తారు. ప్రత్యర్థులను ఎదిరించే క్రమంలో ఆయన చూపించే ఆవేశం, స్వరం పెంచి చెప్పే డైలాగ్ డెలివరీ బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత.
దశాబ్దాలు గడిచినా బాలకృష్ణ సినిమాలలోని పవర్ఫుల్ సీన్లు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. 'సీమ సింహం' లాంటి చిత్రాలు నందమూరి అభిమానులకు ఎప్పుడూ ఒక తీపి జ్ఞాపకం. ఈ వీడియో చూస్తుంటే, బాలయ్య పాత సినిమాలలోని మాస్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండేదో స్పష్టమవుతుంది.
ఇలాంటి పవర్ ఫుల్ సీన్స్, సినిమాల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
The highly anticipated film Peddi is facing unexpected delays, and the rumor mill is in full swing trying to figure out who is responsible. According to inside whispers, the initial delay stemmed from Ram Charan. Rumors suggest he could not allocate the bulk dates the team expected due to various personal reasons, which pushed the shooting schedule back right from the start.
Despite this early setback, the crew reportedly managed to wrap up the first half and a significant portion of the second half. On the musical front, AR Rahman has already finished the background score for the first half and recorded the songs. However, rumors suggest he might have to rework his score, as a few scenes in the first half could change following the current script rewrites.
Things hit a major roadblock with the climax. Rumors indicate that director Buchi Babu Sana felt confused and unsatisfied with how the ending shaped up. Sources say Ram Charan shares this dissatisfaction, finding the current climax lacking. To resolve these creative differences, director Sukumar has reportedly stepped in to guide his former assistant and tweak the ending. But rumors say Sukumar is taking his own time to re-edit and rework the script.
With re-shoots and heavy reworking now needed, industry gossip suggests Charan is growing quite annoyed with the drawn-out process. A special song shoot is still pending, and the team seems uncertain about the exact schedule for the re-shoots. Right now, there is a lot of confusion among sources providing updates about the film.
The only confirmed news at the moment is that the director is actively reworking several portions. With all these struggles, the planned April 30th release date is definitely out of the question, and whether it releases in July, August, or September remains completely unclear.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డెకాయిట్' (Dacoit). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాపై స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
'డెకాయిట్' చూసి ఎంజాయ్ చేశా..
తాజాగా 'డెకాయిట్' సినిమాని వీక్షించిన రామ్ చరణ్ తన అనుభూతిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "నేను డెకాయిట్ సినిమా చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ నటన అద్భుతం. ఆయన నటన గుర్తుండిపోతుంది. మృణాల్ తన పాత్రలోని భావోద్వేగాలను ఎంతో లోతుగా పండించి, పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అనురాగ్ కశ్యప్ తో పాటు ఇతర నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు" అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
కథా నేపథ్యం..
'డెకాయిట్' మూవీ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా సాగుతూనే, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. అడివి శేష్ తనదైన శైలిలో సీరియస్ రోల్ లో మెప్పించగా.. మృణాల్ ఠాకూర్ తన గ్లామర్, నటనతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.
రామ్ చరణ్ 'పెద్ది' అప్డేట్..
ఒకవైపు ఇతర సినిమాలను అభినందిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.
https://x.com/AlwaysRamCharan/status/2043979111136407754
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు, అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు.
ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం. వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే..
ఒంటరితనం..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు.
లోతైన మాటలు..
ఇంట్రోవర్ట్ లు చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు.
అతి ఆలోచనలు..
ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు , నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
తక్కువే.. కానీ బలమైన స్నేహాలు..
ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు. కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు. వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా, ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు.
వినడానికి ప్రాధాన్యత..
ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు. వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్‌జీ అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే..
అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు.
అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
రాజ్యాంగ నిర్మాత..
భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత రాజ్యాంగమే.. ఈ బారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు.
విద్యావంతుడు..
అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు. అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు.
సామాజిక సంస్కర్త..
ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు.
భారతరత్న..
1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు.
సత్యాగ్రహి..
నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే.
న్యాయ శాఖ మంత్రి..
అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
*రూపశ్రీ.
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర. ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది. ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి, కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి, ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి. ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే..
ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం. ఆయాసం ఎక్కువ కావడం, ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం.
బాలీవుడ్లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే..
ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు. ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా 20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా, అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు.
16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే 1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు. వీరికి హేమంత్, వర్ష, ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు.
1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు. ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు.
కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు.
ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను నడుపుతున్నారు.
గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను నడుపుతున్నారు.
ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్‌లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది.
పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు.
ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు.
తన విశిష్టమైన కెరీర్లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసింది.
ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు,
నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.
*రూపశ్రీ.
- ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం
- పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
"కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిలకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్చార్జుల శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.
సిద్ధాంతాలే నాయకత్వానికి బలం
“ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు.
ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామస్థాయికి తీసుకెళ్లాలి
“ఎన్ని పనులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు.
పార్టీతో కార్యకర్తలను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్
“ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్యవసరం. రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగత పనులు పూర్తిచేసుకుని కొంత సమయం కేటాయించి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.
రెడ్ బుక్ సమాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం
“గతంలో దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్యకర్తలను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్పడ్డారు. అమర్నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యలను వెంటాడి మరీ చంపారు. డా.సుధాకర్, కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిలను వేధించి మరణానికి కారకులయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం-దాడులు-హత్యలు-అవినీతితో చెలరేగిపోయిన జగన్..అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విషప్రచారాలతో విరుచుకుపడుతున్నాడు. ఐకమత్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ సమాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగన్ అంటూ కలవరిస్తున్నాడు జగన్. ``
నేతల మధ్య సఖ్యత ముఖ్యం
“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకున్నట్టే, కూటమి నేతలు కుటుంబంలా కూర్చొని చర్చించుకుని విభేదాలు విడనాడలి`` అని సూచించారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రచార పర్వాన్ని ఉధృతం చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండదండలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా రెజీనగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏకమయ్యాయని, వాటి కలయిక అపవిత్రమైనదని ఆయన అభివర్ణించారు. సిద్ధాంతాలు లేని ఇటువంటి కూటములు రాష్ట్రంలో అస్థిరతను సృష్టిస్తాయని, ప్రజలు వీటిని నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.
ముఖ్యంగా ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్‌కు సంబంధించిన వివాదాస్పద వీడియో అంశాన్ని అభిషేక్ ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, విపక్ష నేతలు కుమ్మక్కై రాజకీయ డీల్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అభిషేక్ బెనర్జీ ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియా వ్యూహాలను సమర్థవంతంగా వాడుకుంటున్నారు. మమతా బెనర్జీ వారసుడిగా, పార్టీలో రెండో అత్యున్నత నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎన్ఆర్సీ అమలును అడ్డుకోవడంలో దీదీ పోరాటాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, భావోద్వేగపూరిత ప్రసంగాలతో యువతను ఆకర్షిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీ నాయకత్వ పటిమకు ఒక పెద్ద పరీక్ష వంటివి. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుంటూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయన వేస్తున్న అడుగులు టీఎంసీకి కలిసి వస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, అభివృద్ధి మంత్రంతో ప్రజల వద్దకు వెళ్తున్న అభిషేక్ బెనర్జీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఏదేమైనా, బెంగాల్ పీఠంపై మరోసారి తృణమూల్ జెండా ఎగురుతుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అగ్నిగుండంగా మారింది. మాజీ సీఎం జగన్ తాజాగా తెరపైకి తెచ్చిన మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన పెను సంచలనానికి దారితీసింది. అయితే, ఈ ప్రతిపాదన పట్ల జనం నుంచి ఇసుమంతైనా సానుకూలత వ్యక్తం కాలేదు. సానుకూలత సంగతి అటుంచి, ప్రతికూలత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యింది. జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ మంత్రులు జగన్ తీరును తప్పుబడుతూ గళమెత్తడం పార్టీ అసంతృప్తి, అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసిందంటున్నారు పరిశీలకులు.
జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతుండగా, మళ్లీ కొత్త ప్రాంతాలను తెరపైకి తెచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నారంటూ జగన్ ను నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు, మాజీ మంత్రులు ఈ విషయంలో జగన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంశాలను తాము సమర్థించలేమని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంటున్నారు. గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కేడర్ ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు మావిగన్ అంటే ఇక ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిన తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజలను ఆకట్టుకోవడం అటుంచి.. వారిని పారట్ీకి మరింత దూరం చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ ప్రతిపాదనపై అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి. జగన్ మావిగన్ నినాదంతోనే ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతే కాకుండా, పార్టీలో అసమ్మతి కూడా పీక్స్ కు చేరు అవకాశం ఉందని అంటున్నారు.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు.
ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది:
ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు:
జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.
వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం.
వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.
వీటిని ఎలా వేయాలి?
ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి.
మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక ఒత్తిడి మరియు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.
చాలా సందర్భాల్లో లివర్ 70% నుండి 80% వరకు దెబ్బతినే వరకు మనకు ఎటువంటి బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలను గమనిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
ఈ ప్రత్యేక వీడియోలో, ప్రముఖ నాడిపతి (Nadipathy) నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణమ్ రాజు (Dr. P Krishnam Raju) గారు లివర్ ఆరోగ్యం గురించి, అది దెబ్బతిన్నప్పుడు శరీరం చూపే లక్షణాల గురించి లోతుగా వివరించారు. ఈ Video లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకుందాం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధానాంశాలు:
అలసట మరియు నీరసం:- ఎటువంటి పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా అనిపించడం లివర్ సమస్యకు ప్రాథమిక సంకేతమా?
చర్మం మరియు కళ్ళ రంగు:- కళ్లు పసుపు రంగులోకి మారడం (Jaundice) మరియు చర్మంపై దురదలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలు.
ఆకలి మందగించడం:- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వచ్చేలా ఉండటం దేనికి సంకేతం?
పొత్తికడుపులో మార్పులు:- కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా కుడి వైపున నొప్పి రావడం ఎందుకు జరుగుతుంది?
నాడిపతి చికిత్స:- మందులు లేకుండా కేవలం నాడి నిదానం మరియు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో లివర్ సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చు?
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియో తప్పక చూడండి. కాలేయాన్ని సహజ పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలో డాక్టర్ గారి సూచనలను పాటించండి.
మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం?
శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య..
కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం.
నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు..
పాలకూర..
పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది.
బీట్రూట్ ..
బీట్రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుకూర సలాడ్లు..
ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి. ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు. ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం.
మెంతులు..
మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
కాలీఫ్లవర్..
క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.
*రూపశ్రీ.
