LATEST NEWS
గత వైసీపీ ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలన అందిస్తున్నామనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడికీ, కేంద్ర ప్రభుత్వానికీ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్ అత్యంత నిజాయతీ గల మహిళా నాయకురాలన్న జగ్గారెడ్డి.. . ఆ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. కోర్టుల్లో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో లేవన్నారు. ఇంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నాయకురాలి నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని, ఇది అన్యాయమైన, పిరికిపంద చర్య అని జగ్గారెడ్డి విమర్శించారు.
భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జంతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తున్న ఈ వినూత్న ఉద్యమం తెలంగాణ గడ్డపై కాలూనుతోంది. ఈ నెల 14న హైదరాబాద్ వేదికగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసన సాగనుంది. ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఇండియన్ కాక్రోచ్ జనతాపార్టీ దేశ సరిహద్దులను దాటి విస్తరించింది. మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్ లోకి కూడా చొచ్చుకెళ్లింది. అక్కడ కూడా స్థానిక యువత ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి సరికొత్త గ్రూపులను సోషల్ మీడియాలో ప్రారంభించారు. భాగ్యనగర వీధుల్లో యువత శాంతియుతంగా వినిపించబోయే ఈ గళం, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నెల 4వ తేదీన గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పెద్ది' మానియానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఒక పెళ్లి వేడుకలో రచ్చ లేపడం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం విశేషం.
సినిమాలో చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులతో థియేటర్లను ఊపేసిన 'చికిరి చికిరి' సాంగ్ కు ఒక వరుడు తన పెళ్లి వేడుకలో పెళ్లికూతురు ముందే అద్భుతమైన మాస్ స్టెప్పులు వేశాడు. పెళ్లి పీటలపై కూర్చున్న వధువు చూస్తుండగా, బంధుమిత్రుల కోలాహలం మధ్య సదరు పెళ్లికొడుకు చరణ్ మ్యానరిజమ్‌ను అనుకరిస్తూ ఊరమాస్ రేంజ్లో డ్యాన్స్ చేశాడు. చరణ్ తరహాలోనే ఎంతో ఈజ్‌తో, ఎనర్జీతో అతడు చేసిన ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అక్కడ ఉన్న వారందరినీ తెగ ఆకట్టుకుంది. ఈ క్రేజీ వెడ్డింగ్ డ్యాన్స్ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో మెగా అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, మోహిత్ చౌహాన్ ఆలపించిన ఈ 'చికిరి చికిరి' సాంగ్ సినిమా విడుదల కంటే ముందే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. పక్కా పల్లెటూరి ఫోక్ వైబ్స్‌తో, ఎనర్జిటిక్ రిథమ్స్‌తో డిజైన్ చేసిన ఈ పాట రీల్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఏకంగా ఒక పెళ్లికొడుకు తన లైఫ్‌లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్లో ఈ పాటను ఎంచుకుని చిందులు వేయడం చూస్తుంటే చరణ్ మాస్ సాంగ్స్ కి ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది.
మరోవైపు థియేటర్లలో 'పెద్ది' బాక్సాఫీస్ రన్ అత్యంత అద్భుతంగా సాగుతోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని వంద కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రేసులో దూసుకుపోతోంది. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ నటనకు, బుచ్చిబాబు సానా ఎమోషనల్ టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జాన్వీ కపూర్ హోమ్లీ లుక్, శివరాజ్‌కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమా విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.
ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. "చికిరి చికిరి సాంగ్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్.. పెళ్లికొడుకు చరణ్ అన్నలాగే ఇరగదీశాడు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మైథ్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని అద్భుతమైన వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లలోనే కాకుండా ఇలా రియల్ లైఫ్ సెలబ్రేషన్స్‌లోనూ 'పెద్ది' పాటలు మారుమోగిపోతుండటంతో చిత్ర యూనిట్ సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సాధించిన ఘన విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ గా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందిస్తూ ఆయన కురిపించిన ప్రశంసల జల్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మెగాస్టార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో తన రాబోయే చిత్రం 'మెగా 158' షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ సినిమా విజయం పైనే ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ గత రెండేళ్లుగా పడ్డ కష్టాన్ని, ఆయన చూపించిన డెడికేషన్ ను తాను స్వయంగా చూశానని చిరు పేర్కొన్నారు. ఒక తండ్రిగానే కాకుండా తోటి నటుడిగా చరణ్ పర్ఫార్మెన్స్ చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని ఎమోషనల్ అయ్యారు.
సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ పడిన తపన, శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ భారీ విజయం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలమని చిరంజీవి కొనియాడారు. కేవలం చరణ్‌ను మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన కథను వెండితెరపై ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సనాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మేకింగ్ వాల్యూస్ ను కూడా మెగాస్టార్ మెచ్చుకున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లతో పాటు దివ్యేందు నటనను కూడా చిరు అప్రిషియేట్ చేశారు. సాంకేతిక విభాగంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆర్. రత్నవేలు విజువల్స్, కొల్లా అవినాష్ ఆర్ట్ వర్క్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని ప్రశంసించారు. ఈ సినిమా సమిష్టి కృషి వల్లే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మైలురాయిని దాటే దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా చరణ్ సోలో హీరోగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మెగాస్టార్ నుండి వచ్చిన ఈ అభినందనల పోస్ట్‌తో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. రాబోయే రోజుల్లో ఈ స్పోర్ట్స్ డ్రామా మరిన్ని భారీ వసూళ్లను సాధించి టాలీవుడ్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాలీవుడ్లో తనదైన నటనతో, కటౌట్‌కే తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘మాస్ ప్రొడక్ట్’ అనిపించుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్లో ఎన్నో విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ యాక్షన్ స్టార్, ప్రస్తుతం సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ లవర్స్‌కు, అభిమానులకు ఊహించని రేంజ్లో ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సింగ’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ లేపుతోంది.
ఈ సరికొత్త యాక్షన్ డ్రామాను టాలీవుడ్లో వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించి తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ '70mm ఎంటర్టైన్మెంట్స్' నిర్మిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వి. వెంకట్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గోపీచంద్ సరికొత్త మాస్ మేకోవర్‌లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు ఈ చిన్న గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది.
రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లోకి వెళితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సౌండ్ డిజైనింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా రేంజ్ ఏంటనేది చూపిస్తున్నాయి. చీకటి గదిలో రక్తసిక్తమైన గాయాలతో, కరుడుగట్టిన గడ్డంతో ఉన్న గోపీచంద్ కళ్లు తెరిచి చూసే షాట్ మెగా మాస్‌గా ఉంది. ఆ వెంటనే ఆయన ఒక భారీ సుత్తిని పట్టుకుని చేతితో పైకి లేపే సీన్ చూస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ‘సింగ’ అనే టైటిల్ లోగో డిజైన్ కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా, ఒక వెపన్‌లా డిజైన్ చేయడం విశేషం. గ్లింప్స్‌కి సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ అనార్కలి నాజర్ హీరోయిన్`గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ బెస్ట్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ గ్లింప్స్‌పై మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ గోపీచంద్‌కు బర్త్‌డే విషెస్ తెలపడంతో పాటు 'సింగ' గ్లింప్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్లా ఈ సినిమా ఉండబోతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనుంది.
The makers of Rao Bahadur have unveiled Just A Teaser, giving audiences a first look into the psychological dark comedy directed by Venkatesh Maha and headlined by Satyadev. The teaser opens on an intriguing premise. Ramappa, played by Satyadev, is diagnosed with liver cancer and expected to have limited time left. But as months pass and he continues to survive beyond medical predictions, his condition begins drawing attention and raising questions among people around him.
What starts as a story about survival gradually moves into unfamiliar territory. Instead of treating the situation as a miracle alone, the teaser hints at changes in Ramappa’s inner world. His experiences appear unsettling to outsiders, but from his perspective they seem to carry a different meaning altogether.
Venkatesh Maha appears to be blending psychological drama with dark comedy, using the character’s state of mind as the centre of the narrative. The teaser leaves space for interpretation rather than giving direct answers.
Satyadev drives most of the teaser through multiple shades of the character, while the visuals and background score establish an atmosphere that leans more towards immersion than explanation. Presented by GMB Entertainments and produced by Anurag Reddy, Sharath Chandra and Chinta Gopalakrishna Reddy, Rao Bahadur is scheduled to release in theatres on July 3.
Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
అందం అనేది ఎందుకు పుట్టిందో, అదే అందం ఎందుకు అసూయ పడుతుందో ప్రముఖ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఇది ఎగ్జామ్ ఫుల్ అంటు ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సరికొత్త పిక్స్ నే అందుకు సాక్ష్యం. లేత రంగు (లైట్ కలర్) శారీలో దేవకన్యలా మెరిసిపోతూ ఉన్న సదరు పిక్స్ అయితే అభిమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ విషయంలో సోషల్ మీడియా కూడా నేను సైతం ఫిదా అవుతున్నాను అనే పరిస్థితి
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'ఓం భీమ్ బుష్' తో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'లో తన అందం, అంతకంటే అందమైన నటనతో మెప్పించింది. సినిమాలు మాత్రమే కాకుండా, యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన 'ఆసా కూడా' మరియు 'మొర్ని' వంటి గ్లోబల్ చార్ట్‌బస్టర్ మ్యూజిక్ వీడియోల ద్వారా ఈమె సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఎదిగింది.
Also read: Prudhvi Raj: పండు మాస్టర్ని కలిసిన పృథ్వీ.. ఆ నటుడి ట్వీట్ వైరల్
ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి 'బ్లాస్ట్' మూవీ తో తన సత్తా చాటింది. ఒక రకంగా తనే ఆ చిత్రానికి హీరో అని భావించవచ్చు. సదరు చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ని కూడా అవలీలగా చేసి మెప్పించింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'నాగ్జిల్లా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాలు, రెండు విభిన్న మనస్తత్వాలు , జీవనశైలుల కలయిక కూడా. అటువంటి పరిస్థితిలో, ఒక బంధాన్ని బలంగా ఉంచడానికి కేవలం ప్రేమ మాత్రమే సరిపోదు. చాలాసార్లు, పెళ్లి తర్వాత ప్రజలు తాము మునుపెన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోబోతున్నా లేదా ఇటీవలే వివాహం చేసుకున్నా, కొన్ని ముఖ్యమైన నిజాలు తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ నిజాలు సంబంధంలోని వాస్తవాలను అర్థం చేసుకోవడానికి , వైవాహిక జీవితాన్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి సహాయపడతాయి. ఆ నిజాలు ఏంటో తెలుసుకుంటే..
సంబంధం అంటే కేవలం ప్రేమ కాదు..
వివాహంలో ప్రేమ చాలా ముఖ్యం, కానీ ఒక బంధం కేవలం ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉంటే ఎక్కువ కాలం నిలవదు. వైవాహిక జీవితంలో నమ్మకం, అవగాహన , బాధ్యత ప్రేమలాగే ఎంతో ముఖ్యమైనవి. రోజూ తెల్లవారగానే.., ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, సమయరాహిత్యం వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో, భావోద్వేగాలే కాకుండా పనులు అమలుచేయడం, ఎలా చేయాలని ఆలోచించడం కూడా బంధాన్ని బలంగా మారుస్తుంది.
అంగీకారం..
ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం, పెంపకం, అనుభవాలు భిన్నంగా ఉంటాయి, అందువల్ల పెళ్లి తర్వాత ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఏకాభిప్రాయం మీద ఉండటం జరగదు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజం , ఏ ఆరోగ్యకరమైన సంబంధంలోనైనా అవి ఒక భాగం. కానీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ గౌరవాన్ని కాపాడుకుంటూ, గొడవలు పెంచుకోకుండా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బందం బాగుంటుంది.
ఆర్థిక విషయాలు..
వివాహంలో ఆదాయం, ఖర్చులు, పొదుపు , భవిష్యత్ ప్రణాళికల గురించి బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి విషయంలో పారదర్శకత లేకపోతే, అపార్థాలు పెరిగి, సంబంధం దెబ్బతినవచ్చు.
కలిసి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది.
సర్దుబాటు..
వివాహం అనేది రెండు వేర్వేరు కుటుంబాలు , ఆలోచనల కలయిక, అందువల్ల ఇక్కడ సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు వృత్తి విషయంలో, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతల విషయంలో, మరికొన్నిసార్లు వ్యక్తిగత అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుంటూ, సమతుల్యతను పాటించే జంటల బంధం మరింత బలంగా, స్థిరంగా ఉంటుంది.
మార్పు..
వివాహం జరిగిన తొలిరోజుల్లోని శృంగారం శాశ్వతంగా ఉండదు, కానీ అంతమాత్రాన ప్రేమ అంతమైపోతుందని కాదు. కాలం గడిచే కొద్దీ, సంబంధంలో గాఢత, అవగాహన , బాధ్యత పెరుగుతాయి. శృంగారం ఒక స్థిరమైన, భావోద్వేగ బంధంగా రూపాంతరం చెంది, ఆ సంబంధం చాలా కాలం పాటు నిలిచేలా చేస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మద్య ప్రేమను, బంధాన్ని బలంగా నిలిపేది శృంగార జీవితమే.. దాన్ని కోల్పోతే ఇద్దరిని దగ్గరగా ఉంచడానికి బలమైన కారణం వేరే ఏదీ ఉండదు.
*రూపశ్రీ
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ, ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది. అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు, గోల్డ్, చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు. చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి. మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం..
మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వనట్టు.
ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం..
చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు. ఇది బయటకు తమాషాగా, సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు, భాగస్వామి పుట్టినరోజు, మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు.
ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం..
మహిళలు ఆందోళనలను లేదా సమస్యలను తన భర్తతో షేర్ చేసుకున్నప్పుడు, దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని, ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది.
భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం..
ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం, భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది.
మద్దతు ఇవ్వకపోవడం..
ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు. భార్యను ఏదైనా మాటలు అన్నా, భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి, వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. మహిళలు చాలా భాధపడతారు.
ఒంటరితనం..
ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి, తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది.
ఇతరులతో పోల్చడం..
చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు. అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు, ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు. ప్రతి మనిషిని మనిషిగా చూడాలి, వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
*రూపశ్రీ.
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి, ఇద్దరి మధ్య సరైన అవగాహన, పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది. గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే రిలేషన్షిప్ డిటాక్స్..
శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు, ఇబ్బందులు, అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే..
భాగస్వామితో మాట్లాడాలి..
రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది.
దృష్టి..
ప్రతి ఒక్కరు తమపై తాము దృష్టి పెట్టాలి. ఇది మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ బలాలు, బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి.
సమయం..
నేటికాలంలో ప్రతి ఒక్కరు నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి. ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి. అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి.
దూరం..
రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం. బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.
*రూపశ్రీ.
గత వైసీపీ ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలన అందిస్తున్నామనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడికీ, కేంద్ర ప్రభుత్వానికీ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్ అత్యంత నిజాయతీ గల మహిళా నాయకురాలన్న జగ్గారెడ్డి.. . ఆ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. కోర్టుల్లో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో లేవన్నారు. ఇంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నాయకురాలి నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని, ఇది అన్యాయమైన, పిరికిపంద చర్య అని జగ్గారెడ్డి విమర్శించారు.
భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జంతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తున్న ఈ వినూత్న ఉద్యమం తెలంగాణ గడ్డపై కాలూనుతోంది. ఈ నెల 14న హైదరాబాద్ వేదికగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసన సాగనుంది. ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఇండియన్ కాక్రోచ్ జనతాపార్టీ దేశ సరిహద్దులను దాటి విస్తరించింది. మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్ లోకి కూడా చొచ్చుకెళ్లింది. అక్కడ కూడా స్థానిక యువత ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి సరికొత్త గ్రూపులను సోషల్ మీడియాలో ప్రారంభించారు. భాగ్యనగర వీధుల్లో యువత శాంతియుతంగా వినిపించబోయే ఈ గళం, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం (Jama Akula Kashayam) చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు పడాల రాజమౌళి గారు ఈ వీడియోలో వివరించారు.
జామ ఆకుల కషాయం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు (Benefits).
డయాబెటిస్ (షుగర్), జీర్ణక్రియ సమస్యలు, మరియు బరువు తగ్గడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది?
జామ ఆకుల కషాయాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి?
జీరో బడ్జెట్ లైఫ్‌స్టైల్ (Zero Budget Lifestyle) ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్ గురించి పూర్తి వివరాల కోసం ఈ రోజే ఈ వీడియోను వీక్షించండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి!
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా, పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు. ముఖ్యంగా వేసవిలో, చాలా మంది రోజుకు 24 గంటలూ ఏసీ వాతావరణంలోనే గడుపుతారు. కానీ రోజంతా ఏసీకి గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజంతా ఏసీలో గడిపితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుంటే..
చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్..
ఎయిర్ కండిషనర్లు గదిలోని తేమను తగ్గిస్తాయి, దీనివల్ల చర్మం తన సహజ తేమను కోల్పోతుంది. ఎక్కువసేపు ఏసీలో ఉండే వ్యక్తుల చర్మం సాగడం, పొడిబారడం , దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది మాత్రమే కాకుండా, శరీరానికి చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల చాలాసార్లు దాహం తక్కువగా అనిపించి, తగినంత నీరు తాగరు. ఇది శరీరం డీహైడ్రేషన్ అవ్వడానికి దారితీస్తుంది. అందువల్ల, ఏసీలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా నీరు త్రాగడం, చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ముఖ్యం.
శ్వాసకోశ సమస్యలు..
రోజంతా చల్లని ఏసీ గాలికి గురికావడం వల్ల ముక్కు, గొంతులోని శ్లేష్మ పొరలు పొడిబారిపోతాయి. దీనివల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, అలర్జీలు, దగ్గు వంటి సమస్యలు పెరగవచ్చు.
ఏసీ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే, దానిలో దుమ్ము, బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోయి శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆస్తమా లేదా అలర్జీలు ఉన్న రోగులు ఏసీ లో గడపడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
తలనొప్పి, అలసట..
చాలా చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరం ఎప్పుడూ ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారవలసి వస్తుంది. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్, తలతిరగడం , అలసట కలగవచ్చు. రోజంతా ఏసీలో కూర్చున్న తర్వాత చాలా మంది నీరసంగా, శక్తి కోల్పోయినట్టు ఫీలవుతారు. అత్యంత చల్లని ఉష్ణోగ్రతలు శరీరంలోని సాధారణ రక్త ప్రసరణను ప్రభావితం చేసి, ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కీళ్లు, కండరాల నొప్పి..
ఏసీలోని చల్లని గాలి కండరాలు, కీళ్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చల్లని వాతావరణంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోయి గట్టిపడతాయి. కీళ్లవాతం లేదా దీర్ఘకాలిక కీళ్ల నొప్పితో బాధపడేవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. చాలా మంది మెడ, భుజం , నడుము నొప్పితో కూడా బాధపడుతుంటారు, దీనికి ఏసీలో నిరంతరం కూర్చోవడం ఒక కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
కంటి ఆరోగ్యం..
ఏసీ పరిసరాల్లోని తేమను తగ్గిస్తుంది, దీనివల్ల కళ్లపై కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల కళ్లలో పొడిబారడం, ఎర్రబడటం, దురద , మంట కలగవచ్చు. ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్లపై పనిచేసే వారికి ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించే వ్యక్తులకు కూడా కళ్లలో అసౌకరం కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో తగినంత నీరు త్రాగడం , అవసరమైతే వైద్యుల సలహాతో కంటి చుక్కల మందును ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇమ్యూనిటీ పవర్..
ఎల్లప్పుడూ చల్లని వాతావరణంలో ఉంటే శరీరం అనుసరించే సహజ మెకానికల్ సైకిల్ ప్రభావితం అవుతుంది. చాలాసేపు ఏసీలో ఉండి, అకస్మాత్తుగా వేడి వాతావరణంలోకి వెళ్లినప్పుడు, శరీరం ఉష్ణోగ్రత మార్పుకు సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీనివల్ల జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. ఈ ప్రభావం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఎప్పుడూ ఏసీలోనే కాకుండా అప్పుడప్పుడు బయట వాతావరణంలో గడపడం వ్యాయామాలు చేయడం వంటివి శరీరానికి చాలా మంచిది.
*రూపశ్రీ.
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం ప్రయోజనాలను నాశనం చేస్తుంది. ఏదో అప్పుడప్పుడు నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికంగా చక్కెర కలపడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
నిమ్మరసం..
భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి, తేమతో కూడిన రోజులలో మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని, రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు. నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చక్కర కలిపితే..
నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు.
నారింజ రసం కూడా..
నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రుచి మెరుగవ్వాలంటే..
నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది. చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
*రూపశ్రీ
