Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇది చాలా కాస్ట్ లీ వార్ గురూ!
posted on: Mar 4, 2026 10:21AM

ఈ యుద్ధంలో ఒక రోజుకు ఎంత ఖర్చవుతుంది? ఇప్పటి వరకూ అయిన ఖర్చు ఎంత? అన్న ప్రశ్నలకు లక్షల కోట్లు అని సమాధానం వస్తోంది. ఒక్కో మిస్సైల్, ఒక్కో డిఫెన్స్ సిస్టమ్ విలువ కోట్లల్లో ఉంటుంది. దీంతో వాటి వాడకం వల్ల కూడా అంతే స్థాయిలో ఖర్చవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న మోస్ట్ హై టెక్నలాజికల్ వార్ కి గానూ ఒక రోజుకు ఇరు పక్షాలకు కలిపి 2 బిలియన్ డాలర్ల నుంచి నాలుగు బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే పదహారు వేల కోట్ల నుంచి 32 వేల కోట్ల వరకూ ఈ ఖర్చు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ ఖర్చు.. ఎంతో చూస్తే.. ఈ దేశం ఐరన్ డోమ్ వాడుతోంది. ఇందులోని ఒక్కో ఇంటర్ సెప్టర్ క్షిపణి ఖరీదు.. 50 వేల డాలర్లు. అంటే నలభై రెండు లక్షల రూపాయలు. ఇక యారో సిస్టమ్ అయితే ఒక్కో మిస్సైల్ ఖర్చు ఏకంగా రూ.29 కోట్ల వరకూ ఉంటుంది. ఇరాన్ వందలాది క్షిపణులు ప్రయోగించినపుడు వాటిని అడ్డుకోడానికే ఇజ్రాయెల్ కి ఒక రోజుకు ఒక బిలియన్ డాలర్ల వరకూ ఖర్చవుతుంది. అంటే ఒక రోజు ఇజ్రాయెల్ ఖర్చు సుమారు 8 వేల కోట్లన్నమాట.
ఇరాన్ ఖర్చు ఎంతుంటుందో గమనిస్తే.. కొన్ని కొన్ని రక్షణ రంగ నివేదికల ప్రకారం.. బాలిస్టిక్ క్షిపణుల తయారీ, లాంచింగ్ ఖర్చు రోజుకు 500 మిలియన్ల వరకూ ఉంటుంది. కేవలం యుద్ధంలో పాల్గొనడానికే కాదు సేనలను మోహరించడానికి కూడా అమెరికాకు ఒక రోజుకు ఇంతే ఖర్చు అవుతోంది.
ఫిబ్రవరి చివరిలో యుద్ధం ఉధృతమైంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ నష్టం సుమారు వంద బిలియన్ డాలర్లు. అంటే 8.3 లక్షల కోట్లు దాటినట్టుగా అంచనా. విభాగాల వారీగా చూస్తే ఆయుధాలు, ఇంధనం, సైనిక మోహరింపు కోసం 30 బిలియన్ డాలర్లు. ఇరాన్ అణు కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఇజ్రాయెల్ నగరాల్లో దెబ్బ తిన్న మౌలిక సదుపాయాల విలువ 40 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక చమురు ధరలు పెరగడం, షిప్పింగ్ నిలిచిపోవడంవల్ల ప్రపంచ దేశాలకు జరిగిన ఆర్ధిక నష్టం విలువ మరో 30 బిలియన్లు.
భారత్ పైనా ఈ ప్రభావం పడక మానదు. ముడి చమురు బ్యారెల్ ధర డాలర్ పెరిగినా.. భారత ప్రభుత్వంపై ఏటా పది వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ ధరల పెరుగుదల వల్ల భారత్ కు రోజుకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోంది. దానికి తోడు డాలర్ కి డిమాండ్ పెరిగి రూపాయ విలువ మరింత పతనం అవుతోంది.
ఈ యుద్ధం ఇలా కంటిన్యూ అయితే ప్రపంచ దేశాల్లో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది. రక్త పాతంతో పాటు, ఆర్ధిక విధ్వంసం ప్రజలను కుదేలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడుందరూ జపించాల్సింది ఓం శాంతి శాంతి శాంతి! మంత్రం.






