ఈ ఒక్క సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది..!

ప్రతి జబ్బు మనిషికి ఏదో ఒక అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని తక్కువ ప్రమాదం కలిగి ఉంటే.. మరికొన్ని ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటాయి. ఇంకా ఈ వ్యాధులు కూడా మగవారికి వేరుగానూ, ఆడవారికి వేరుగానూ కొన్ని ఉంటాయి. అయితే.. మహిళలలో వచ్చే ఒకే ఒక సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? ఇదెలా గర్భస్రావాలకు కారణం అవుతుంది తెలుసుకుంటే..
థైరాయిడ్ లోపం (హైపోథైరాయిడిజం). ఇది మహిళల పీరియడ్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా గర్భధారణకు కూడా ఆటంకం కలిగిస్తుంది. థైరాయిడ్ కారణంగానే 10 మందిలో కనీసం నలుగురికి గర్భస్రావాలు జరుగుతాయని, ముఖ్యంగా మొదటి మూడు నెలల్లోనే జరుగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. థైరాయిడ్ లోపం ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు.
సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
కొంతమందిలో ఈ సమస్యను సకాలంలో నిర్వహించకపోతే.. ఇది పదేపదే గర్భస్రావాలు అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు . అదే సమయంలో ఇది దీర్ఘకాలికంగా సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అని అంటారు, అంటే థైరాయిడ్ లోపం.
థైరాయిడ్ లోపం ఉన్నవారికి ఆకలి వేయకపోవడం అనే లక్షణం ఉంటుంది. దీన్ని బట్టి ఈ సమస్య మీద అనుమానించి వైద్యుల దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయింటుకోవచ్చు. ఆకలి వేయకపోయినా, ఆహారం ఎక్కువ తినకపోయినా వీరు బరువు పెరుగుతూ ఉంటారు.
నెలసరి ఆలస్యం..
థైరాయిడ్ లోపం వల్ల పీరియడ్స్ రాకపోవడం లేదా సకాలంలో రాకపోవడం జరుగుతుంది. రెండు నుండి మూడు నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. అదే సమయంలో కొంతమంది గర్భం దాల్చలేరు. మహిళలు గర్భవతి అయినప్పటికీ, బిడ్డ హృదయ స్పందన రాదు, హృదయ స్పందన వచ్చినప్పటికీ, మొదటి మూడు నెలల్లో రక్తస్రావం కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి .
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మహిళలు చేయాల్సిన పని ఇదీ..
మహిళలు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే, ముందుగా థైరాయిడ్ హార్మోన్‌ను తనిఖీ చేసుకోవాలి. అలాగే ఈ హార్మోన్ లోపం ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి వైద్యుల సహాయంతో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా గర్భస్రావం జరగకుండా ఆపవచ్చు.
*రూపశ్రీ.



.webp)