ఆడవారి దారుణమైన నెలసరి వెనుక షాకింగ్ సమస్య ఇదే!
ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయ కుహరం వెలుపల గర్భాశయ లైనింగ్ కణజాలం పెరిగే ఒక సమస్య. గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. ఈ పొరమీద కణజాలం పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటున్నారు. దీని ప్రభావం కారణంగా దీన్ని ఒక జబ్బుగా పరిగణిస్తున్నారు.
అండాశయాలు, ప్రేగులు కటి మొదలైన భాగాల్లో ఎండోమెట్రియల్ కణజాలం పెరిగినప్పుడు ఎండోమెట్రియోసిస్ వస్తుంది. కణజాలం పెల్విక్ ప్రాంతం దాటి వ్యాప్తి చెందడం చాలా అరుదుగా జరుగుతుంది. గర్భాశయం వెలుపల పెరుగుతున్న ఎండోమెట్రియల్ కణజాలాన్ని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్ అంటారు.
ఎండోమెట్రియోసిస్ ప్రతి స్త్రీని వేర్వేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రామాణికమైన చికిత్స లేదు. కొన్ని జీవనశైలి సర్దుబాట్లు, ఇంటి నివారణలు, చికిత్సా వ్యూహాలు, ఇంకా ప్రిస్క్రిప్షన్ మందులు ఈ సమస్య నుండి ఊరటను ఇస్తాయి.
ఎండోమెట్రియోసిస్ సమస్య గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. ఇలాంటి సమయంలో వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. సంతానోత్పత్తి చికిత్సలో అండాశయాలను ప్రేరేపించడం నుండి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వరకు అన్ని ఉంటాయి . ఎండోమెట్రియోసిస్ శారీరకంగా మానసికంగా ఎదుర్కోవడం చాలా కష్టమైన అనారోగ్యం గా పేర్కొనవచ్చు. కానీ దీన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
పోషణపై నిఘా ఉంచాలి..
సరైన భోజనం తీసుకోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ నుండి రక్షణ పొందవచ్చు. మంట, ప్రోస్టాగ్లాండిన్ జీవక్రియ, ఈస్ట్రోజెన్ స్థాయిలు ఈ సమస్యపై ప్రభావితం చూపిస్తాయి. ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం, అలాగే తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా రసాయనాలు కాకుండా సేంద్రీయంగా ఉత్పత్తి చేసినవి తీసుకోవడం మంచిది. రసాయనాలు ఎక్కువ ఉన్న ఆహారం ఎండోమెట్రియోసిస్ కు కారణం అవుతుంది.
హీటింగ్ ప్యాడ్ ఇలా ఉండాలి..
నెలసరి సమస్యల్లో అధికంగా ఋతు రక్తం పోవడం, పొత్తి కడుపు నొప్పి, కటి భాగంలో నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి పరిష్కారంగా హీటింగ్ ప్యాడ్ వాడుతుంటారు చాలామంది. అయితే ఇది ఎలక్ట్రానిక్ తరహా హీటింగ్ ప్యాడ్ కాకపోతే మంచిది. ఆరోగ్య వంతమైన హీటింగ్ ప్యాడ్ పొత్తికడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
సహజమైనవి తీసుకోవాలి..
పశుగ్రాసంలో ఉండే కొన్ని పురుగుమందులు డయాక్సిన్ అనే టాక్సిన్ ను కలిగి ఉంటాయి. ఇవి ఎండోమెట్రియోసిస్ రావడానికి కారణం అవుతాయి. మాంసాహారం వినియోగాన్ని తగ్గించడం ద్వారా వీలైనంత వరకు తక్కువ గ్లూటెన్, సేంద్రీయ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అదే రసాయనాలు ఉన్న ఆహారం తీసుకుంటే అది హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తుంది.
శస్త్రచికిత్స..
గర్భం దాల్చకూడదనుకునే మహిళల్లో ఏకంగా , గర్భాశయం యొక్క తొలగింపు వరకు ఈ సమస్య వెళ్తుంది. అధిక నెలసరి ప్రవాహం,గర్భాశయ తిమ్మిరి కారణంగా బాధాకరమైన ఋతుస్రావం జరుగుతుంది . ఇలాటి సమయాల్లో చాలామంది ఇక గర్భాశయమే వద్దనుకునే స్థితిలోకి జారుకుంటారు. 35ఏళ్ల లోపు ఈ సమస్య ఎదురైతే ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.
విటమిన్ డి, విటమిన్ బి విటమిన్లను కచ్చితంగా తీసుకోవాలి..
విటమిన్ డి ని "హ్యాపీ విటమిన్" అని పిలుస్తారు, ఇది ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. ఎండోమెట్రియోసిస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో విటమిన్ B శక్తిని పెంచుతుంది. ఆహారంలో కొవ్వు ఎండోమెట్రియోసిస్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, అత్యధికంగా ట్రాన్స్ ఫ్యాట్‌లను తిన్నవారిలో ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రమాదం 48% పెరిగింది. ఒమేగా-3 నూనెలు ఎక్కువగా తీసుకునేవారు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే ఎండోమెట్రియోసిస్ ప్రమాదాన్ని 22% తగ్గించారు. సాల్మన్, అవిసె గింజలు వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఎండోమెట్రియోసిస్ తగ్గించడంలో ఉపయోగపడతాయి.
◆నిశ్శబ్ద.