బరువు తగ్గి మళ్ళీ పెరుగుతున్నారా? అయితే మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..

 

బరువు తగ్గడం అనేది అతి పెద్ద కష్టాలలో ఒకటి అని మీరు అంగీకరిస్తారు. ఒక పరిశోధన అంచనా ప్రకారం బరువు తగ్గిన వారిలో 80% మంది ఒక సంవత్సరంలోపు బరువును తిరిగి పొందుతారు.  ఎప్పుడైనా బరువు తగ్గి మళ్ళీ  దాన్ని తిరిగి పొందినట్లయితే ఈ సమస్య గురించి  అంతో ఇంతో అనుభవం ఉండి ఉంటుంది. దీర్ఘకాల బరువు తగ్గడంలో 20% మంది వ్యక్తులు మాత్రమే విజయవంతమయ్యారని పరిశోధనలో తేలింది. బరువు తగ్గేవారు తమ బరువును ఎక్కువ కాలం ఎలా మెయింటైన్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అది పెద్ద విషయం కాదు. కానీ అక్కడున్న పొరపాటల్లా తగ్గిన బరువు పెరగకుండా ఏం చెయ్యాలన్నదే.  కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా తగ్గిన  బరువును అలాగే మైంటైన్ చేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..

మొదటిది, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. తద్వారా  బరువును తగ్గించుకోవడం. బరువు తగ్గాలనే ఆలోచనతో ఆకలి వేస్తున్నా దాన్ని అణిచిపెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.  అలా చేయడం వల్ల  శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. కాబ్టటి  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునంటూ బరువు తగ్గితే అది  దీర్ఘకాలం నిలిచి ఉంటుంది.

బరువు తగ్గగానే ఇక సమస్య ఏమీ లేదులే అనుకుని నచ్చినట్టు తినడం చాలామంది చేసే తప్పు. మరీ ముఖ్యంగా బయటి ఆహారాలు, బేకరీ ఫుడ్స్ వంటివి రెచ్చిపోయి తింటుంటారు. కానీ ఇలా బరువు తగ్గడం మళ్ళీ ఇలాంటి ఆహారాలు తినడం శరీర వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. ముందున్న బరువు కంటే రెండింతల బరువు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆహారం ద్వారా హార్మోన్లు అసమతుల్యానికి గురవుతాయి.

బరువు తగ్గిన తరువాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే దానికి మంచి మార్గం బరువును ట్రాక్ చేయడం. ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంచుకోవాలి. ప్రతివారం బరువును చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి బరువు పెరుగుతూ ఉంటే ఆహారం నుండి విహారం వరకు ఏయే మార్పులు చేసుకోవాలో తమకు తాము అర్థం చేసుకోగలుగుతారు.

చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు డైటింగ్ కూడా ఫాలో అయి ఉంటారు. ఇలా ఫాలో అయిన డైటింగ్ ను బరువు తగ్గగానే ఆపేయడం మంచిది కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ పూర్తీగా ఆ డైటింగ్ ను వదిలేయడం అంటే తిరిగి బరువు పెరగడానికి మార్గం ఫిక్స్ చేసుకుంటున్నట్టు.  బరువు తగ్గామనే సంతోషంలో అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని ఇష్టానుసారం తినడం మంచిది కాదు. స్వీట్లు, నూనె పదార్థాలు, శుద్దిచేసిన ఆహారం, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైనవాటికి చాలా దూరం ఉండాలి.

పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే బరువు  తగ్గిన తరువాత పొరపాటున కూడా మళ్లీ పెరగడం అనే సమస్య ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం   అప్పటివరకు కష్టపడి తగ్గిన బరువు అంతా కొండలా మళ్ళీ పెరగడం మొదలవుతుంది.

                                                                    *నిశ్శబ్ద.