కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా..?   ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే చాలు ఒక యుద్దానికి వెళుతున్నంత హంగామా- ఒక స్కార్ఫ్, గ్లోవ్స్, షేడ్స్... ఇలా చాలా సిద్ధం చేసుకుంటుంటాం. కాలుష్యం గురించిన భయం అలాంటిది మరి. ఈ కాలుష్యం పుట్టిన పిల్లలకే కాదు, కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదమేనట. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి........  https://www.youtube.com/watch?v=-YtONTv7XUI    

  అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ (Health and Beauty with Dry Fruits)     మనలో చాలామంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటాం. అంతేతప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం. కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఎం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూరం , అత్తి పండు , సీమబాదం:- అత్తిపండు, సీమబాదం డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఒక రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్ లా పనిచేస్తుంది. బాదం:- బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ దానిలో ఉండే ఫ్యాట్ అన్ శ్యాచురేటెడ్ కావడంతో అది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.  

  కోల్డ్ అనేది సర్వ సాధారణమైన లక్షణం. ఇది పెద్ద జబ్బేం కాదు, అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. జలుబు చేసేది ముక్కుకే అయినా ముఖమంతా ఏదో పాకుతున్నట్టు యమా చేరాకేస్తుంది. కోల్డ్ వల్ల శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. తిండి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. నిద్ర పట్టడం కష్టమౌతుంది. ఇంత ఇబ్బంది పెట్టే కోల్డ్ గురించి ఓ నానుడి ఉంది. దీనికి మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది, వాడితే వారంలో తగ్గుతుంది- అని. అంటే కోల్డ్ కు ఔషధం వేసుకున్నా లాభం లేదనేది తాత్పర్యం. అనేకమంది అనుభవాలు ఆ మాట నిజమే అనిపించేలా చేశాయి. అలాగని మెడిసిన్లు వేసుకోకుండా కోల్డ్ ను ముదరబెట్టుకుంటే ఆనక బాధపడక తప్పదు. దీర్ఘకాలంపాటు జలుబు కనుక తగ్గకపోతే, అది న్యుమోనియాకు దారితీస్తుంది. పూర్వకాలం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కోల్డ్ కు చాలానే మందులున్నాయి. మందుల సంగతి అలా ఉంచితే అనేక గృహ చిట్కాలు కూడా ఉన్నాయి.  పసుపు, పటిక బెల్లములను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే కోల్డ్ తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.  గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి , దించి వడపోసి నిలువ చేసుకోవడం ఇంకో పధ్ధతి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే, జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి.కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి. పిండి, కారం లాంటివి జల్లించినా, కాస్త అటక దులిపినా వెంటనే ఎలర్జీ బయటపడిపోతుంది. ఆఖరికి సాంబ్రాణి పొగ కూడా పడనివారు ఉంటారు.  అలాగే కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ముక్కు అంటూ ఉన్నాక జలుబు చేయకుండా ఉండదు. కానీ చీటికిమాటికి కోల్డ్ వస్తుంటే ఆలోచించాల్సిందే. డాక్టర్ను సంప్రదించాలి. రెసిస్టేన్స్ పవర్ తగ్గితే కూడా త్వరగా కోల్డ్ చేస్తుందని గ్రహించాలి. మొత్తానికి ఎక్కువకాలం పాటు రొంప వదలకుండా బాధిస్తుంటే, లోపల ఏదో అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.  

నెలసరి సమయానికి రావడం లేదా..?   రుతుక్రమం.. నెలసరి.. బహిష్టు పేరేదైనా సరే ఇది కేవలం స్త్రీ శరీరంలో జరిగే సహజ శారీరక మార్పుకాదు.. దాన్ని స్త్రీత్వానికీ, మాతృత్వానికీ ప్రతీకగానే చూస్తుంది భారతీయ సమాజం. అందుకే నెలసరి రాకపోవడం అమ్మాయిలనీ.. మానసికంగా, శరీరకంగా కృంగదీస్తుంది. ఇందుకు గల కారణాలు.. చికిత్స విధానం.. తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?time_continue=2&v=_m9rabrQ3Ro  

కూర్చునే ఉంటే ముసలివారైపోతారు     కొంతమందిని చూడండి. ఎంత పెద్దవారైనా కూడా వయసు మీద పడినట్లే అనిపించదు. మరికొందరేమో కుర్రతనంలోనే నడివయసు మీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి స్థితికి ఒకానొక కారణం తెలిసిపోయిందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన కొందరు వైద్యులు నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలికీ, ముసలితనానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు 64 నుంచి 95 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓ 1500 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరందరి జీవనశైలికి సంబంధించి అనేక వివరాలను సేకరించారు. వీరు రోజులో ఎంతసేపు కూర్చుని ఉంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు వంటి గణాంకాలను నమోదు చేశారు. అంతేకాకుండా వీరి శరీర కదలికలను గమనించేందుకు నడుముకి accelerometer అనే పరికరాన్ని జోడించారు. రోజుకి నలభై నిమిషాలన్నా శరీర శ్రమ లేకుండా కనీసం పదేసి గంటలపాటు కూర్చునే ఆడవారి డీఎన్‌ఏలో ఓ వింతమార్పుని గమనించారు పరిశోధకులు. వీరి డీఎన్‌ఏలోని telomeres అనే వ్యవస్థ త్వరగా దెబ్బతింటున్నట్లు తేలింది. ఈ telomeres మన డీఎన్‌ఏ చివరన ఓ తొడుగులా ఉండి అవి త్వరగా నిర్వీర్యం అయిపోకుండా కాపాడతాయి. మనలోని వయసు పెరిగే కొద్దీ telomeres అరిగిపోతాయి. దాంతోపాటుగానే శరీరంలో కణాలకి రక్షణ కరువై అనేక సమస్యలు మొదలవుతాయి. వయసు మీరే కొద్దీ సహజంగా రావాల్సిన ఈ మార్పు మన బద్ధకం వల్ల త్వరగా వచ్చేస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం పైకి చూడ్డానికి ఎలా ఉన్నా, అంతర్గతంగా దాదాపు ఎనిమిదేళ్లు ఎక్కువ ఆయుష్షుకి చేరుకుంటుందట. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో కూడా ఇలా telomeres త్వరగా అరిగిపోవడాన్ని గమనించారు. అదీ విషయం! మన నిస్తేజం వల్ల శరీరం లోలోపల ఇంత అనర్థం జరుగుతుందన్నమాట. అందుకని బద్ధకాన్ని వీడి రోజుకి కనీసం ఓ అరగంటన్నా వ్యాయామం చేయమని సూచిస్తున్నారు. అప్పుడు ఆరోగ్యమేం కర్మ వయసు కూడా పదహారేళ్ల దగ్గరే ఆగిపోతుంది.   - నిర్జర.

కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్   రోజూ వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా.. ఈ ఉరుకుల పరుగుల రొటీన్ జీవితంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే కదలకుండా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో స్టిఫ్ షోల్డర్ వంటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈమధ్య. ఆ ఇబ్బందులని అధిగమించాలంటే... ఎప్పుడు, ఎక్కడ, ఏ కాస్త సమయం దొరికినా కూడా కూర్చున్న చోటనే చిన్న చిన్న కదలికల్ని చేయటం మంచిది అంటున్నారు నిపుణులు. ఎలా అంటే ... 1. ప్రతి అరగంటకి ఒకసారి కూర్చున్న భంగిమను మార్చాలి. అలాగే కళ్ళు ఆర్పి, తెరవటం చేయాలి. 2. ప్రతి గంటకి ఒకసారి కుర్చీలోంచి లేచి అటు, ఇటు నడవాలి. వీలు కాకపొతే ఓ ఐదు నిముషాలు నిల్చోవాలి. 3. అలాగే కుర్చీలో కూర్చుని మెడని పైకప్పు కేసి సాగదీయాలి. అంటే పైకప్పు వైపు చూస్తుండాలి అన్నమాట. 4. ఇక అప్పుడప్పుడు మెడని ఒక పక్కనుంచి మరో పక్కకి అడ్డంగా తిప్పాలి. 5. భుజాలని అప్పుడప్పుడు గుండ్రంగా తిప్పాలి. అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని తిప్పాలి. ఇలా ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడ వున్నా మోచేతులు, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, మెడ ఇలా జాయింట్స్ ని కదుపుతూ చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేస్తే ... పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలనుంచి బయటపడచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు. - రమ

  ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి     వాకింగ్ అన్నిటకంటే మంచి వ్యాయామం అంటారు నిపుణులు. కానీ సిటీలో ఉండేవాళ్లకు వాకింగ్ చేయడం కష్టమే. దగ్గర్లో ఏదైనా పార్క్ ఉంటే ఓకే. లేదంటే ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వాహనాల రొద, దుమ్ము ధూళిలో నడక అసాధ్యం. అందుకే ఎక్కువమంది జిమ్ ల మీద ఆధారపడేవాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్లిపోయి ప్రశాంతంగా కాసేపు వ్యాయామం చేసుకోవడంలే ఉండే సుఖమే వేరు కదా! అయితే జిమ్ లో చేరాలనుకునేవాళ్లు, చేరినవాళ్లు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది.   ముందుగా ఆలోచించాల్సింది దుస్తుల గురించి. జిమ్ కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.   వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరుగా వెళ్లి మొదలుపెట్టేస్తే వెనువెంటనే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి. అలాగే శరీరాన్నిహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి, వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడమే కష్టమైపోతుంది.   అదే విధంగా వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్ చేయడం చాలా అవసరం. శరరం కష్టపడుతోంది కదా ఆ ఒత్తడిని మనసు మీద పడనివ్వకూడదు. అందుకే అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే వ్యాయామం చేస్తున్నంతసేపూ చక్కని సంగీతం వినండి. చాలా జిమ్స్ లో ఈ సౌకర్యం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే జిమ్ లో మీ అనుభవం ఆనందంగా ఉంటుంది. ఫలితం తృప్తికరంగా ఉంటుంది. - Sameera    

మహిళలకోసమే టెక్సాస్ అబార్షన్ చట్టం..   స్త్రీల ఆరోగ్యసంరక్షణకోసమే టెక్సాస్ అబార్షన్ చట్టం... సెప్టెంబర్ ఒకటి 2021న  సుప్రీం కోర్ట్ టెక్సాస్ బిల్  ఎబార్షన్ ను నిషేదించాలన్న అంశం పై గడువు విధించింది. ఈ చట్టాన్ని ప్రజా ఆరోగ్యం లో నిపుణులైన వారితో ,స్వచ్చంద సంస్థలు కలిసిస్త్రీ ఆరోగ్యం సంరక్షించేందుకు కృ షి చేసి.  రూపొందించిన చట్టంగా పేర్కొనారు. నిషేదం ఎలా ప్రభావ వంతంగా ఉంటుంది.దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ కు ఎలా ఉపయోగ పడుతుంది.అన్నది ప్రస్న. టెక్సాస్ లో సెప్టెంబర్ 1 న అబార్షన్ బిల్ ను గవర్నర్ గ్రెగ్  అబోట్ సంతకం చేయడం తో చట్టంగా రూపొందింది. అమలులోకి వచ్చింది.దీనిని నిలుపు దల చేయరాదని సుప్రీం ఆదేశించింది.కొత్త చట్టం ప్రకారం సెనేట్ బిల్ 8    (SB8)ప్రభావ వంతం గా ను అబార్షన్ ను నిషేదిస్తుంది తరువాత ఆమె ప్రేగ్నేన్సి ని అది చివరి సారి ఆమె నెల సారి అప్పటి నుంచి లెక్కలోకి తీసుకుంటారు. ఈ బిల్లు వల్ల హార్ట్ బీట్ ను కనుగొనవచ్చు.సుప్రీం కోర్టు నిర్ణయించి ప్రకటన చేసిన అనంతరం శక్తి వంతంగా ప్రజలకు సంరక్షణ ఇస్తుందని తెలుస్తోందని నిపుణులు అభిప్రాయ పడ్డారు చాలా మంది నిపుణులు ఆరు నేలాలు లెక్కించే విషయం లో చట్టానికి ఉన్న ప్రాతిపదిక చ్స్త్తబద్దత ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. దేనిని ఆధారంగా తీసుకున్నారు స్త్రీలు గర్భవతులు అని తెలుసు కోవడం చాలా ఆలస్యంగా తెలుస్తుందని చాలారాష్ట్రాలలో అబార్షన్ ను  అనుమతిస్తున్నప్పటికీ 2౦ లేదా 24 వారాలు కటాఫ్ పాయింట్ గా ఉన్నప్పుడు వారు సర్వైవ్ కాగలరు. తొలి వారాలలో ఆమె గర్భం దాల్చిన సమయంలో ఆమె  రక్త పోటును హార్ట్ బీట్  తదితర అం శాలాలో గుర్తించవచ్చు. SB8.వైద్య ప్రక్రియలో గుర్తించవచ్చు.అదే సమయం లో ఆమె జీవించేందుకు పుట్టేందుకు ఆమె గర్భం లో ఎదుగుతుంది. ఈ సమయంలో హార్ట్ బీట్ నివారించవచ్చు.అంటారు వైద్యులు. sb8 ద్వారా ఆరోగ్య సంరక్షణ అమలు నాణ్యమైన ఆరోగ్యం. వైద్య పరంగా నియంత్రణ సాధ్యమేనా అన్నది ఒక కంట్ర వర్సీ ఆరు వారాలకే గర్భం దాల్చరాదని  తెలుస్తుందా. sb8 ఆరోగ్య సంరక్షణ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.మనుషుల మధ్య వ్యత్యాసం,జాతి వివక్ష అబార్షన్ చట్టం ప్రభావం కనపడుతుంది.దీని ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుంది అన్నదే ప్రశ్న.  అసలు అబార్షన్ చట్టం లేకుండానే భారాత్,చైనా లాంటి దేశాలలో 7.5 మిలియన్ల ఆడపిల్లలు గర్భం లో నే పురిట్లోనే చంపేస్తున్నా ఘటనను చూసి సిగ్గు పడాలి.ఎచట్టా లులేకుండానే ఇన్ని బ్రూణ హాత్యలు చేసిన ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఎబార్షన్ చట్టాలు అవసరమా. అబార్షన్ వల్ల  స్త్ర్రీలు  ఎలాంటి సమస్య ఎదుర్కుంటారు.ఆరోగ్యం పై వచ్చే రీ యాక్షన్ ఏమిటి.ఎబార్శన్స్ వద్దనా? అబర్షాన్స్ చట్టం చేయడం కేవలం జనాభా నియంత్రనకా? ఎ బార్షన్ లేకుండా సంతానం ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వాస్తాయి ,అన్న అంశం పై ఆర్ధికంగా ప్రభావం పడుతుందా అన్నది మరో ప్రశ్న.

జాగో... జాగింగ్ కరో!   * జాగింగ్ అనేది చక్కని ఆరోగ్య ప్రక్రియ. జాగింగ్ వలన కొన్ని వారాలలోనే మీ శరీరం ఫిట్‌గా తయారవుతుంది. అయితే జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. * జాగింగ్ చేసేటప్పుడు మంచి దుస్తులు ఎంచుకోండి. మరీ బిగుతుగా ఉన్న వాటిని కాకుండా వదులుగా సౌకర్యవంతంగా ఉన్న వాటిని ధరించండి, పరిగెత్తటానికి మంచి షూలను వాడండి. షూ సరిగా లేనట్లయితే పరిగెత్తటానికి  సౌకర్యంగా ఉండదు. * జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా, కొన్ని సులభమైన వ్యాయామాలను చేయండి. వీటిని వార్మప్ ఎక్సర్‌సైజులు అంటారు. వేగంగా నడవటం ప్రారంభించి, కొద్ది కొద్దిగా పరిగెత్తి, వేగంగా పరిగెత్తండి. వీటి వలన ప్రశాంతమైన జాగింగ్‌ని ఆస్వాదిస్తారు.  * సరైన పద్ధతిలో పరిగెత్తండి. సరైన విధంగా జాగింగ్ చేయకపోవటం వలన వెన్నునొప్పి లేదా వెన్ను సమస్యలు వచ్చే ఇబ్బంది వుంది. *  కాంక్రీటుతో చేసిన నేలపైన జాగింగ్ చేయకుండా గడ్డి ఉండే నేల పైన జాగింగ్ చేయటం వలన కాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. జాగింగ్ చేయటానికి ముందుగా  నీటిని పుష్కలంగా తాగండి. వీలుంటే వాటర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్ళండి. జాగింగ్ చేశాక వెంటనే ఆగకుండా నెమ్మదిగా వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా నడుస్తూ క్రమంగా ఆపేయండి.  *  రోజు జాగింగ్ చేయటం వలన జిమ్ చేసిన ఫలితాలను పొందుతారు. * జాగింగ్ ను ఉత్సాహవంతమైన నడకతో ప్రారంభించండి. * ప్రతిరోజూ 40 నిమిషాల జాగింగ్ వలన శరీర బరువు తగ్గుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాలు కూడా తగ్గుతాయి. మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. * జాగింగ్ వలన శరీర రక్త ప్రసరణ మెరుగు పడటమే కాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. * ప్రతిరోజూ జాగింగ్ చేయడం వలన వారం రోజులలో 1000 కేలరీలు వ్యయమవుతాయి.

ప్రెగ్నెంటా... అయితే అది తినకండి! గర్భం దాల్చాక కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. తొమ్మిది నెలలూ బిడ్డను మోసి కనే వరకూ ఆ బుజ్జాయి గురించిన ఆలోచనలే. అయితే ఆ తొమ్మిది నెలలూ టెన్షన్ కూడా అలానే ఉంటుంది. ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎంత తినాలి,  ఎప్పుడు తినాలి అన్నీ కన్ ఫ్యూజన్లే. పెద్దవాళ్లేమో నోటికి రుచిగా నాలుగు రకాలూ తినమంటారు. డాక్టర్లేమో ఏది పడితే అది తినొద్దంటారు. దాంతో తల్లికి చెప్పలేనంత చింత. అయితే నిజానికి మరీ నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా చక్కగా తినొచ్చు. ఒకే ఒక్కటి తప్ప... అదే చక్కెర.       స్వీట్లు ఇష్టపడేవాళ్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చాక కొందరికి అవీ ఇవీ తినాలన్న ఆశ పెరిగిపోతుంది. అయితే ఆ అవీ ఇవీలో చక్కెర ఉండకూడదని తేల్చేశారు వైద్యులు. ఇటీవలే జరిగిన ఓ పరిశోధనలో... కడుపుతో ఉన్నప్పుడు స్వీట్స్ ఎక్కువగా తిన్నవారి పిల్లలకు కొన్ని రకాల సమస్యలు వచ్చినట్టు గుర్తించారు. గర్భవతులు చక్కెర ఎక్కువగా తింటే పిల్లలకు అలర్జీలు వస్తుంటాయట. ఆస్తమా, ఒబెసిటీ వంటి సమస్యలూ తలెత్తుతాయట. మిగతా పిల్లల్లో కంటే ఈ పిల్లలకు రకరకాల అనారోగ్యం సమస్యలు ముప్ఫై శాతం అధికంగా వస్తాయని నిర్ధారించేశారు.  అయితే ఒకటి. సహజసిద్ధమైన ఆహారం ద్వారా ఒంట్లోకి చేరే చక్కెర వల్ల సమస్య ఉండదట. అంటే పండ్ల ద్వారా, కూరగాయల ద్వారా, తేనె వంటి సహజమైన ఆహారాల ద్వారా ఏ ప్రమాదమూ ఉండదన్నమాట. చక్కెర, బెల్లం వంటివి వేసి మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలతోనే సమస్య అంతా. కాబట్టి వీలైనంత వరకూ గర్భంతో ఉన్నప్పుడు స్వీట్స్ కి దూరంగా ఉండటమే మంచిదట. తెలిసింది కదా! తల్లిగా పొందే తీయని ఆనందం కోసం తీపికి కాస్త దూరంగా ఉండండి మరి! -Sameera    

  When to start Post partum workouts   Doctors prescribe for a reasonable exercise regime for pregnant woman. If, followed, then it will have a healthy impact and help women before delivery and also to recoup fast, even after delivering the baby. when, women exercise throughout pregnancy and had a normal vaginal delivery, then its safe to do light exercise like walking, modified push-ups, and stretching – within days of giving birth. Starting slowly with a low-impact aerobic activity such as walking and when regain strength, then increase the length or number of walks. In case of c-section, consult with your doctor first, before proceeding ahead. But , have to wait until your recovery from operation before beginning an exercise program. An incision from a c-section takes at least several weeks to heal, and it may be some time after that before you feel like working out. However, walking at an easy pace is encouraged because it promotes healing and helps prevent blood clots and other complications. In any case, carrying out fitness program through out pregnancy was not happened, then there is a possibility that, joints and ligaments will still be loose for about three to five months, so watch your step to avoid falling. If you still want to take an exercise class, try to take classes by a postpartum exercise specialist. Now a days many recreation centers, gyms, and yoga studios offer exercise classes for new moms. Or you could always go for a low-impact class that focuses on toning and stretching. Exercise is good for you, but don't overdo it for the first few months after giving birth. Your body needs time to heal, and you need time to adjust to your new role – and bond with your baby is most important than above all. - Bhavana  

Foods to Boost Your Mood     Nuts: Dry fruits or nuts as we call them are all high in magnesium, which plays a major role in converting sugar into energy, and are also filled with fiber to keep your blood sugar levels even.   Keep a bag of nuts like almonds, cashews and hazelnuts at your desk and just a handful will give you longer lasting energy than a cup of coffee ever will.   Dark Chocolate: Eat a square or two of dark chocolate energizes the body by providing an excellent source of iron and magnesium. Dark chocolate can improve cognitive function, it can prevent Alzheimer and dementia and it can also boost your mood in a matter of minutes.   The darker the chocolate you consume, the better! Dark chocolate slows down the production of stress hormone, and the anxiety levels automatically decrease, moreover, chocolate also makes the brain release endorphins and also boosts the serotonin levels. This creates a feeling of well-being that lasts for several hours.   Green Tea/ Ginger Tea: A large review of studies conducted by researchers world over found that drinking three cups of tea daily was associated with a positive attitude. Also a report recently showed that study participants who sipped four or more cups of green tea daily reported having a more positive mood.   Green tea has been used for thousands of years due to its numerous benefits. Just like berries, green tea is also very rich in antioxidants, amino acids and L-theanine, known for reducing stress and anxiety while improving the mood. If consumed on a regular basis, green tea can give a feeling of overall well-being.   Fish: Salmon is a great source of the energy-boosting goodness that is essential omega-3 fatty acids, which are important for energy production, brain activity and circulation.     Just a gram of fish oil each day and noticed a 50 percent decrease in symptoms such as anxiety, sleep disorders, unexplained feelings of sadness, suicidal thoughts.   Milk: Milk contains proteins high in tryptophan, which is a building block in the bloodstream for serotonin in the brain.   It’s a source of carbohydrates and vitamin D (low levels have been associated with depression), which is required for the production of serotonin. Milk is also a source of calcium, which has been shown to reduce anxiety.   Banana: Bananas contain high amounts of vitamins and minerals, as well as tryptophan which is known for raising serotonin levels.   All the compounds found in bananas are mood-boosting, and vitamin B6 converts tryptophan into serotonin, the mood-lifting hormone. Bananas are one of the world’s best foods for supplying your body with energy. Rich in potassium and B vitamins, they can provide your body with a more sustained release of energy. The supply of vitamins and carbohydrates in bananas make you feel full, help slow down digestion and keep blood sugar levels stable. ..Divya

ఇంట్లోనే ఫిట్ నెస్ టిప్స్..   ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదా బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకే ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా...? * వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయాలి.ఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి. * వర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం. * ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. * ప్రాణాయామం వంటి శ్వాసపరమెన వ్యాయామాలు ఈ కాలంలో చాలా మంచివి. * వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం. * కాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ కాలంలో రెగ్యులర్‌గా వాకింగ్‌ కుదరదు కాబట్టి, వారు తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.

Stay Fit While Aging Fitness looks like very challenging for women who cross 50. But, recent surveys say that now most of the urban women are particular about their fitness as they grow by.. If you are already on this routine work out, that’s wonderful; otherwise also, it's not too late to start. Because, physical activity helps you to cope up with symptoms of menopause like, joint pain, and sleep problems. Exercise also lowers your risk of developing heart disease, diabetes, and osteoporosis. Along with this, regular workouts help you to control weight and melts fat. The effects of exercise are so good that, it has major impact on your health for the better. Your biological age may be differing from your chronological age; ma condition occurs due to inactive lifestyle. If you follow a consistent exercise program, you can easily come out of such difficulties. But, ensure that you consult with your doctor before you start any fitness program, especially if you have any of the risk factors for heart disease. Walking is the best exercise and increases your fitness level. Its easy to do and being regular, maintaining regularity, increasing time span gradually are the only keys here.Swimming and dance are also good exercises to try.If you have right company and a professional trainer then this will be fun. Work up 25-30 minutes per session, 3 or 4 days a week. Make sure, that you can pass the “talk test,” ; means exercising at a pace that allows you carry on a conversation. Also, try stretching exercises; this helps to maintain flexibility and range of motion in joints. They also reduce the risk of injury and muscle soreness. Yoga and Pilates are good forms of stretching exercise; they build core body strength and increase stability. Make exercise a part of your daily routine. Every day counts, so, if you're too busy for a regular workout, look for other ways to be in motion. Research shows that all those extra steps you take during the day add up to big health benefits. Therefore, hook to a particular form of exercise of your choice and enjoy very moment of. That's the biggest secret behind staying fit ever. - Bhavana 

  No Overdose Please In this competitive world, peer pressure and social pressures are pushing people in to problems. One among them is, over doing workouts just to reach a zero size body. But have you ever thought about the repercussions this over exercise has? Every body in this planet is unique and responds differently to different workouts. “When you aim to own certain size and shape and do too much of work outs without listening to your body or not knowing the characteristics of your body, then the results will bring more complications than ever” say experts. You might end up with physiological, psychological or hormonal imbalances which are too dangerous. Before starting any work out plan, consulting your family doctor is must. Especially for women, if you had deliveries and surgeries then you have to take advise from your gynaecologist on your wait loss or gain. Then they will tell you the figure you have to arrive based on your age, medical background. But never ever jump in to conclusion and play with your body by undergoing too much of workout regime unless doctor prescribes the same. Avoid too much work out: When you are working out in a gym having no expert around or having no knowledge on how to use and how much to use the machines then it might cause injuries to you. So avoid too much workout than the required dose. Listen to your body: When the exercises you are doing cross the normal limit then body will surely give you an alarm. Be open to receive the same. You body is your best friend and tells you what is good for you and what is not. Catch the signals and stop there when your body is saying you are already overburdened. Address health issues: When doing regular work outs and proper exercise can bring back your health, it can even destroy more if you cross the limit and do excessive workout. so make sure that your exercises are always as advised by your trainer / expert. ....Bhavana

Best Foods For Flat Stomach The secret for a flat stomach is eating supportively . In addition to regular exercise, you have to add some fat burning foods to your diet to help trim your waistline. Foods that are high in protein and fiber are the best kinds of food to eat if you want to burn fat around your middle. Almonds Almonds contain protein, fiber, and vitamin E, a powerful antioxidant. They’re also a good source of magnesium which is a mineral your body must have in order to produce energy, build and maintain muscle tissue, and regulate blood sugar. Eggs Eat at least one egg day, Eggs are the perfect protein source and if you have an egg in the morning you will feel less hungry throughout the day. Soy Soybeans are a great source of antioxidants, fiber, and protein. Liquid soy also makes a good meal replacement. Try a soy protein shake to lose more weight. Apples A large apple contains 5 grams of fiber, but it’s also nearly 85 percent water which helps you feel full. Apples also contain quercetin, a compound shown to help fight certain cancers, reduce cholesterol damage, and promote healthy lungs. Berries Berries are full of fiber which helps with calorie absorption and are also high in antioxidants which can help blood flow in turn making muscles contract more efficiently. Leafy Greens Leafy greens are also a good source of calcium, an essential ingredient for muscle contraction. In other words, they help fuel your workouts. Yogurt The probiotic bacteria in most yogurts helps keep your digestive system healthy, which means a lower incidence of bloating and constipation which is good for your stomach. Walnuts loaded with heart-healthy omega-3s, and anti-inflammatory polyphenols and muscle-building protein, walnuts are one of the healthiest snacks you can eat. They also help curb your appetite if you eat a handful about a half hour before a meal. Salmon Seafood, especially fatty fish like salmon, tuna, and mackerel, is an excellent source of omega-3 fatty acids. These uber-healthy fats may help promote fat burning by making your metabolism. Seafood is an excellent source of abs-friendly protein. Oats Oats are packed with soluble fiber and protein, oats help lower the risk of heart disease and feed your muscles with energy. There’s a reason for the sayings “sow your oats” and “feel your oats.” Oats rock.

శరీరానికి రక్ష..... ద్రాక్ష     నల్ల ద్రాక్ష... శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. చర్మానికి జీవకళను తెచ్చిపెడుతుంది. అలాగే జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ద్రాక్షలో పండ్లలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలోని కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి ద్రాక్ష పండు చాల మంచివి. ఈ పండ్లు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. కొవ్వు పట్టకుండా చూస్తాయి. కనుక లావుగా ఉన్న వారు వీటిని ఎన్ని తిన్నా లాభమే కానీ, ఎలాంటి నష్టం ఉండదు. ఇందులో ఫైటో కెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తోంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్ష ఆరోగ్యానికి అన్నివిధాలా సహకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది.  అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది. ఉన్నట్టుండి నీరసంగా  కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఈ వేసవిలో చాల మందికి ఎదురయ్యే సమస్య శరీరం బలహీనంగా ఉండడం రక్తలేమి విటమిన్ల లోపం , ఎండలో ఎక్కువ తిరగడం వంటివన్నీ ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాంటపుడు ఈ నల్ల ద్రాక్ష రసం తాగి చుడండి ,తక్షణ శక్తి శరీరానికి అందుతుంది.

  బరువు తగ్గాలంటే ఇవి తాగాల్సిందే!     పెరిగినంత త్వరగా తరిగేది కాదు బరువు. కాస్త జంక్ ఫుడ్ తింటే వచ్చేసే ఒళ్లు... నానా తంటాలు పడినా తగ్గదు. ఎక్సర్ సైజులనీ, డైటింగనీ ఎంత కష్టపడాలో. అయితే మీ కష్టాన్ని తగ్గించే మార్గం ఒకటుంది. రోజుకొకటి చొప్పున కొన్ని వారాల పాటు రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూసులు తాగేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. 1. నాలుగు టొమాటోలు, ఓ కీర దోసకాయ, గుప్పెడు కొత్తిమీర ఆకులు కలిపి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగాలి. 2. ఒక బీట్ రూట్, ఒక కట్ట పాలకూర, గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని నీటితో కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కాస్తంత ఉప్పు కలిపి సేవించాలి. 3. ఓ యాపిల్, ఒక అరటిపండు, నీళ్లు కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండి, చిటికెడు ఉప్పు వేసి తాగేయాలి.     4. క్యారట్, బీట్ రూట్, క్యాప్సికమ్ ఒక్కోటి చొప్పున తీసుకోవాలి. వీటిలో కొన్ని నల్లద్రాక్షలు, చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నీళ్లు కలిపి పల్చగా చేసుకుని తాగాలి. 5. పుచ్చకాయ, పుదీనాలను నీళ్లతో కలిపి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం, కాసింత మిరియాల పొడి వేసి సేవించాలి. 6. యాపిల్, కీరా, పాలకూరల్ని నీళ్లతో కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కాస్త నిమ్మరసం, ఉప్పు కూడా కలిపి తాగాలి. 7. టొమాటోలు, పాలకూర, క్యారెట్, మిరియాలు, ఉప్పు కలిపి చేసిన జ్యూస్ కూడా ఎంతో మంచిది.     ఈ ఏడు జ్యూసుల్నీ రోజుకొకటి చొప్పున తాగి చూడండి. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు. శరీరంలో తేమ పెరిగి చర్మం తళుకులీనుతుంది. ఒంట్లో శక్తి పుంజుకుంటుంది. అయితే ఒకటి. తాగలేకపోతున్నాం అని వీటిలో చక్కెర మాత్రం కలపకండి. కలిపారో... ఇక ఇవి తాగడం వల్ల ఉపయోగం ఉండదు. - Sameera