బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం.
వెజ్ - శాకాహారం:
ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ :
1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం.
2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం.
మధ్యాహ్నం - లంచ్ :
1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి.
2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి.
3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి.
రాత్రి - డిన్నర్ :
1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు.
2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి.
మాంసాహారం:
ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ :
1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు.
2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం.
మధ్యాహ్నం - లంచ్ :
1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి
2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు.
రాత్రి - డిన్నర్ :
1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు.
2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు.
ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.