మహిళలు ప్రెగ్నెన్సీ టైం లో వీటికి దూరంగా ఉండాలి..!

మహిళల ఆరోగ్యం చాలా క్లిష్టమైనది. చిన్నతనం నుండి ఒక్కో దశలో ఒక్కో మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మహిళ జీవితాన్ని, శరీర తత్వాన్ని పూర్తీగా మార్చేసే దశ గర్భం దాల్చడం. గర్బం దాల్చడం, ప్రసవించడం చాలా పెద్ద మార్పులకు కారణం అవుతాయి. గర్భధారణ సమయంలో తల్లి తన ఆరోగ్యం గురించే కాకుండా తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ఏ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల మహిళల ఫిట్‌నెస్, ఆరోగ్యం దెబ్బతింటుందో తెలుసుకుంటే.. తల్లిబిడ్డలు క్షేమంగా ఉండొచ్చు. అవేంటో తెలుసుకుంటే..
కెఫీన్..
గర్భాధారణ సమయంలో టీ, కాఫీ వంటి కెఫీస్ కలిగిన ఆహారాలను నివారించాలని వైద్యులు చెబుతున్నారు. ఇవి శిశువు ఎదుగుదలకు, అభివృద్దికి ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు.
పండ్లు..
గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఏ పండ్లు తినాలి, ఏవి తినకూడదు అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి, ద్రాక్ష, మామిడి, పైనాపిల్ తినడం వల్ల గర్భిణి స్త్రీలకు వెన్ను నొప్పి, అకాల ప్రసవం లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయట.
ఆహారం..
తీసుకునే ఆహారం మీదే చాలామంది ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోవడం మానేయాలి. వీటిలో ఎక్కువ రసాయనాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
శుభ్రత..
మార్కెట్ నుండి తెచ్చిన ఏదైనా పండ్లు లేదా కూరగాయలను కడగకుండా తినడం లేదా తయారు చేయడం ప్రమాదకరం. వీటిలో క్రిములు, రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. శుభ్రం చేయకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ధూమపానం, మద్యపానం..
బారతీయ మహిళలు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగానే ఉంటారు. కానీ కొందరు విదేశీ కల్చర్ పట్ల ఆకర్షితులై గర్భధారణ సమయంలో పొగతాగడం, మద్యం సేవించడం వంటివి చేస్తారు. ఇవి కడుపులో బిడ్డ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వీటిలోని నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ శిశువు ఎదుగుదలను దెబ్బ తీస్తాయి.
జంక్ ఫుడ్..
నేటికాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వ్యసనంగా మారిన ఆహారపు అలవాటు జంక్ ఫుడ్ తినడం. వీటి వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభించవు. కేవలం కేలరీలు, ఫ్యాట్స్ తప్పితే వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఏమీ ఉండవు. జంక్ ఫుడ్ తినడం వల్ల స్త్రీలు, పిల్లలు ఇద్దరికీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పచ్చి ఆహారాలు..
చాలామందికి పచ్చి మాంసం, పచ్చి గుడ్లు, అలాగే పచ్చిగా ఉన్న ఆహారాలు తినే అలవాటు ఉంటుంది. సాల్మోనెల్లా, పాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ అనారోగ్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.

.webp)
.webp)
.webp)