40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సరైనదేనా..

ప్రతి మహిళకు గర్భం దాల్చడం, మాతృత్వం పొందడం చాలా గొప్ప అనుభూతి. అయితే చాలామంది మహిళలు ఎంత వయసు అయినా గర్బం దాల్చలేకపోతారు. మరికొందరు మొదటి బిడ్డ అయిన తర్వాత కాస్త ఆలస్యంగా మళ్లీ బిడ్డ కావాలని అనుకుంటారు. ఇలాంటి వారు ఆలస్యంగా గర్భం దాల్చడం, తల్లికావడం జరుగుతుంది. అయితే ఇలా ఆలస్యంగా.. 40 ఏళ్ల వయసులో కూడా తల్లి కావడం సరైనదైనా? దీని వల్ల ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు ఉన్నాయా? అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం సురక్షితమేనా కాదా? తెలుసుకుంటే..
గైనకాలజిస్టులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం 35ఏళ్ల తర్వాత మహిళలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుంది. దీని కారణంగా 35 సంవత్సరాల తర్వాత మహిళలు దాదాపు మూడింటి రెండు వంతుల జంటలు బిడ్డను కనడంలో ఇబ్బందిని ఎదుర్కుంటారు. మూడింటి రెండు వంతుల జంటలు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంటారు.
ఒక నిర్థిష్ట వయసు తర్వాత మహిళల శరీరంలో అండాల సంఖ్య తగ్గడం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇది సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగానే చాలామంది మహిళలలో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒక నిర్థిష్ట వయసు తర్వాత మహిళల శరీరంలో అండాలు విడుదల అయినా అవి ఆరోగ్యకరంగా ఉండవు. మరీ ముఖ్యంగా ఫలదీకరణ ప్రక్రియ జరగడానికి తగినంత ఆరోగ్యంగా ఉండవు.
35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య తగ్గుతూ ఉండటంతో అవి సరిగ్గా విడుదల కావు. గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా చాలా రెట్లు ఉంటుంది. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ .. గర్భం వచ్చిన తర్వాత అది అధిక ప్రమాదంతో కూడుకుని ఉంటుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు.
అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం అనేది ఎందుకు అంత ప్రమాదం అనే విషయాన్ని చెప్టూ గైనకాలజిస్టులు చెప్పిన విషయం.. ప్రీఎక్లంప్సియా అంటే అధిక రక్తపోటు. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుందట.
40 ఏళ్ల వయసులో తల్లులయ్యే మహిళలకు పుట్టే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుందట. దీని కారణంగా 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు గర్భం దాలిస్తే వాళ్లకే కాకుండా..పుట్టే పిల్లలు కూడా ప్రమాదంలో పుట్టే అవకాశాలు చాలా ఉంటాయి. పుట్టినప్పుడు బిడ్డ బరువు కూడా తక్కువగా పుట్టే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
*రూపశ్రీ.



.webp)