'భీష్మ' థాంక్స్ మీట్‌కు మెగా హీరో!
on Feb 27, 2020
నితిన్ టైటిల్ రోల్ చేసిన 'భీష్మ' సూపర్ హిట్ రేంజిలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైజాగ్‌లో ఫిబ్రవరి 29న థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. దీనికి చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ హాజరవుతుండటం గమనార్హం. వైజాగ్‌లోని సిరిపురంలో ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 29 సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు. 'భీష్మ' విడుదలకు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన నిర్మాతలు, ఇప్పుడు సినిమా పెద్ద హిట్ కావడంతో, దాన్ని ప్రజల ముందు సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వైజాగ్‌ను వేదికగా ఎంపికచేశారు.
నిజానికి చీఫ్ గెస్ట్‌గా పవన్ కల్యాణ్‌ను పిలిచారు కానీ, ఆయన కొన్ని కారణాల రీత్యా రాలేనని చెప్పారు. దాంతో అదే ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌ను ఆహ్వానించారు. పవన్‌కు నితిన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సినిమా విడుదలయ్యాక నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ నాగవంశీ ముగ్గురూ పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లడం, ఆయన వారిని అభినందించడం తెలిసిందే. ఐదు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించిన 'భీష్మ' ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది. రష్మికా మందన్న నాయికగా నటించిన ఈ మూవీ నితిన్ కెరీర్‌లో 'అ ఆ' తర్వాత రెండో స్థానంలో నిలవడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
