అల... అతడూ అల్లు అర్జున్ విలనే
on Oct 26, 2019
త్రివిక్రమ్ సినిమాల్లో విలన్ అంటే అతడికి ఓ స్పెషల్ స్టయిల్ ఉంటుంది. స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. 'జల్సా'లో ముఖేష్ రుషి, 'అత్తారింటికి దారేది'లో కోట శ్రీనివాసరావు, 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర, 'అరవింద వీరరాఘవ సమేత'లో జగపతిబాబు... ప్రతి ఒక్కరికీ కెరీర్లో గుర్తుంచుకునే పాత్రలు ఇచ్చాడు. అప్పటివరకూ వాళ్లు చేసిన సినిమాల్లో పాత్రలకు భిన్నమైన పాత్రలు ఇచ్చాడు. మరి, తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖనికి ఎటువంటి పాత్ర ఇచ్చాడో?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా సినిమా 'అల... వైకుంఠపురములో'. ఇందులో టబు, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, మురళీ శర్మ, సుశాంత్, సచిన్ ఖడేకర్, జయరామ్, నాజర్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు. వీరితో పాటు సముద్రఖని కూడా సినిమాలో ఉన్నారు. సినిమాలోని విలన్స్ లో అతడూ ఒకడు. శ్రీకాకుళం యాసలో సముద్రఖని పాత్ర మాట్లాడుతుందట. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
