బన్నీ కొడుకు ఫేవరేట్ హీరో బన్నీ కాదు!
on Mar 17, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. బన్నీ కొడుకు ఐదేళ్ల అయాన్ కూడా సినిమా వాతావరణంలోనే పెరుగుతూ, సినిమాలు చూస్తూ వస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'ఓ మై గాడ్ డాడీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలోనూ యాక్ట్ చేశాడు. అయితే అతడి ఫేవరేట్ హీరో తండ్రి అల్లు అర్జున్ కాదు, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. టైగర్ లేటెస్ట్ ఫిల్మ్ 'బాఘీ 3' బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టయింది. కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్లు మూతపడకపోతే, ఆ సినిమా ఇండియాలో రూ. 100 కోట్ల మార్కును దాటి ఉండేది.
టైగర్ ష్రాఫ్ అంటే తనకు ఎందుకు ఇష్టమో అయాన్ చెప్పిన వీడియో క్లిప్‌ను అల్లు అర్జున్ ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అందులో టైగర్ ష్రాఫ్ పేరును 'టైగర్ స్వ్కాష్' అని ఉచ్ఛరించాడు అయాన్. ఆ క్లిప్‌ను టైగర్‌కు ట్యాగ్ చేసిన హ్యాండ్లర్ "అతను నిన్ను టైగర్ స్క్వాష్ అని సంబోధించాడు. అది క్యూట్‌గా ఉంది కాబట్టి దాన్ని నేను మార్చలేదు. బాఘీ 1, 2 అంటే అయాన్‌కు పిచ్చి" అని పోస్ట్ చేశాడు. 'బాఘీ 3' సెట్‌కు తనను పిలవమని ఆ వీడియోలో చెప్పాడు అయాన్. టైగర్ ఎందుకిష్టమని తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకు అతని బాడీ, అతను చేసే ఫైట్లు ఇష్టమని చెప్పాడు.
దీనికి టైగర్ ష్రాఫ్ స్పందించాడు. కేవలం ‘భాఘీ 3’ సెట్ కే కాకుండా, "నేను యాక్ట్ చేస్తోన్న అన్ని సినిమాల సెట్స్‌కు ఆహ్వానిస్తున్నానని అయాన్‌కు చెప్పండి అల్లు అర్జున్ సర్" అని కామెంట్ పెట్టాడు. అంతేకాదు, అయాన్ తనకు పెట్టిన కొత్త పేరును ఎంతో ఇష్టపడుతున్నానని బన్నీకి తెలిపాడు. బన్నీ హీరోగా నటించిన 'పరుగు' సినిమా హిందీ రీమేక్ 'హీరోపంతి'తోటే టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
