'ఖైదీ'లో కార్తీలా బన్నీ ఫైట్...
on May 1, 2020
తెలుగునాట తమిళ కథానాయకుడు కార్తీ ఫాలోయింగ్, విజయాల శాతం నానాటికీ తీసికట్టుగా మారుతున్న వేళ 'ఖైదీ' వచ్చింది. సినిమా విజయానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఓ కారణం అయితే... యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్లు, ఛేజింగులు మరో కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా అడ్డరోడ్డులో వెళుతున్నప్పుడు వచ్చే ఫైట్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప'లో సైతం అటువంటి ఛేజింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది. అయితే... 'ఖైదీ' తరహాలో కాకుండా అంతకు మించి అనేలా ఉంటుందట.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమాలో అల్లు అర్జున్ ట్రక్ డ్రయివర్‌గా కనిపిస్తారట. ఒక సన్నివేశంలో అతడు ఎర్రచందనం తీసుకు వెళుతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేసే క్రమంలో పెద్ద ఫైట్ ఒకటి జరుగుతుందట. అడవిలో అల్లు అర్జున్ లారీ తోలే ఈ ఛేజ్ సినిమాకి హైలైట్ అవుతుందని టాక్. దీని కోసం భారీ బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. 'ఖైదీ'లో కార్తీ కూడా లారీ తోలుతూ కనిపిస్తారు. అయితే... ఆ పాత్రకు, 'పుష్ప'లో అల్లు అర్జున్ పాత్రకు ఏమాత్రం సంబంధం ఉండదట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
