'పుష్ప' సినిమాటోగ్రాఫర్ మారనున్నాడు!
on May 13, 2020
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' మూవీని పూర్తిగా ఇండియాలోనే చిత్రీకరించాలని నిర్మాతలు సంకల్పించారు. పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం ప్రకారం ఆ సినిమా పోలిష్ సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ బ్రోజెక్ స్థానంలో మరో సినిమాటోగ్రాఫర్ రానున్నాడు. కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోన్న తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలపై రెస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయి. దీంతో 'పుష్ప' ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని బ్రోజెక్ నిర్ణయించుకున్నాడని వినిపిస్తోంది. బ్రోజెక్‌కు ఇదే తొలి టాలీవుడ్ ఫిల్మ్ కాదు. దీనికి ముందు నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన 'నానీస్ గ్యాంగ్‌లీడర్' మూవీకి అతను పనిచేశాడు. అతని పనితనం చూసి 'పుష్ప'కు అతడిని తీసుకున్నాడు బన్నీ.
నిజానికి రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవాలనేది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన. 'రంగస్థలం'కు అద్భుతమైన విజువల్స్ ఇచ్చింది అతనే. అయితే బన్నీ సూచన మేరకు బ్రోజెక్‌ను తీసుకున్నాడు సుకుమార్. బన్నీ నిర్ణయం సరైనదేనని ఇప్పటివరకూ అతను తీసిన సన్నివేశాలు తెలియజేశాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కనిపించిన సన్నివేశం బ్రోజెక్ పనితనానికి నిదర్శనం. 'పుష్ప'లో నాయికగా రష్మికా మందన్న నటిస్తోంది. కాగా తమిళ వెర్షన్‌లో విలన్‌గా కనిపించడానికి ఇష్టపడని విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచే తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్ ముగిశాక ఈ సినిమా షూటింగ్ కొనసాగనున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
