విజయశాంతి ఒప్పుకోవాలే గానీ...
on Oct 26, 2019
దీపావళి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి లుక్ విడుదల చేశారు. సినిమాలో ఆమె భారతి పాత్రలో నటిస్తున్న మేకర్స్ తెలిపారు. పదమూడేళ్ల విరామం తరవాత లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న రాములమ్మ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాలో ఆమె లుక్ ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూశారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... విజయశాంతి లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది.
రాజకీయ సభల్లో, మామూలుగా టీవీల్లో విజయశాంతిని చూసిన ప్రేక్షకులు... మేకప్ లో సినిమాటిక్ లుక్ లో ఆమెను చూసి సంతోషపడుతున్నారు. విజయశాంతిలో ఒక రాజసం కనబడుతోంది. ఆమె మరిన్ని సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవాలే గానీ.. 'బాహుబలి'లో రమ్యకృష్ణ, 'అత్తారింటికి దారేది'లో నదియా, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ చేసినటువంటి పాత్రలను ఆమె కోసమే ప్రత్యేకంగా రాస్తారు. నిర్మాతలు, దర్శకులు ఇంటి ముందు క్యూ కట్టడం గ్యారెంటీ. ఇక, 'సరిలేరు నీకెవ్వరు' విషయానికి వస్తే శనివారం సాయంత్రం సినిమాలో మహేష్ బాబు పోస్టర్ మరొకటి విడుదల చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
