రజనీకాంత్ లుక్‌ని బాలకృష్ణ కాపీ కొట్టాడా...?
on Oct 26, 2019
నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు ‘రూలర్’ టైటిల్ ఖరారు చేసినట్టు దీపావళి సందర్భంగా అనౌన్స్ చేశారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రూలర్’ టైటిల్ ముందునుంచీ అనుకుంటున్నదే. జెమినీ వాళ్లు శాటిలైట్ రైట్స్ తీసుకున్నామని అనౌన్స్ చేసినప్పుడు సినిమా టైటిల్ ‘రూలర్’ అని చెప్పేశారు. దీపావళి సందర్భంగా అభిమానులకు ఇచ్చిన కానుక ఏంటంటే... సినిమాలో బాలకృష్ణ రెండో లుక్. ఇప్పటికే స్టైయిలిష్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. లేటెస్టుగా పోలీస్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో బాలకృష్ణ రౌడీ పోలీస్‌గా కనిపించనున్నాడు. ఒక్క క్యారెక్టర్ చేస్తున్నాడా? రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే... ఈ పోలీస్ లుక్ ఇలా రిలీజైందో? లేదో? కాపీ పోస్టర్ అంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం... రజనీకాంత్ ‘దర్బార్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రజనీ పోలీస్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఓ స్టిల్‌లో లాఠీ పట్టుకుని స్టైల్‌గా ఉన్నాడు. ఆ పోస్టర్, స్టిల్‌కు దీపావళి సందర్భంగా విడుదల చేసిన బాలకృష్ణ స్టిల్, పోస్టర్ దగ్గర దగ్గరగా ఉంది. రజనీ చేతిలో లాఠీ ఉంటే... బాలయ్య చేతిలో సుత్తి ఉంది. దాంతో కాపీ అనేస్తున్నారు. ఈ విమర్శలపై ‘రూలర్’ టీమ్ ఏమంటుందో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
