అల్లు అర్జున్ ఆటలు... పాఠాలు
on Mar 21, 2020
హీరో... జీరో... అనే తేడా లేదు. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్యులు సూచన లాంటి హెచ్చరిక చేశారు. తమవంతు సామాజిక బాధ్యతగా ఆల్రెడీ స్టార్స్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంటికి పరిమితం అయ్యారు. స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. మరి, ఇంట్లో ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? కుమారుడు అయాన్, కుమార్తె అర్హతో కలిసి ఆడుకుంటున్నారు. అంతే కాదు... పిల్లలకు పాఠాలు కూడా చెబుతున్నారు. పిల్లాడు కొంచెం పెద్దోడు కాబట్టి... కిడ్స్‌కి ప్రాక్టికల్‌గా పాఠాలు చెప్పే సైన్స్ ల్యాబ్ ఎక్విప్‌మెంట్‌తో పాఠాలు చెబుతున్నారు. అర్హ చిన్నది కాబట్టి ఆమెకు కలర్స్ వంటివి నేర్పిస్తున్నారు. మొత్తం మీద కలిసి వచ్చిన ఈ సమయాన్ని కుటుంబానికి బాగా కేటాయిస్తున్నారు అల్లు అర్జున్. ఈపాటికి సుకుమార్ సినిమా షూటింగ్‌తో ఆయన బిజీగా ఉండాలి. అయితే... కరోనా కారణంగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
