డిసెంబర్ 7న రేసు గుర్రం ఫస్ట్ లుక్
on Dec 5, 2013
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసు గుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు. కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లుగా బన్నీ తెలిపాడు. "రేసు గుర్రం"లో బన్నీ సరసన శృతిహాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియోను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.