డబ్బుతో ఎవరు కొనలేరు: బెల్లంకొండ
on Dec 5, 2013
వినాయక్ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంపై నిర్మాత సురేష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయంపై సురేష్ మాట్లాడుతూ..తను నిర్మించిన "ఆది" చిత్రంతో వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. వినాయక్ నా బిడ్డలాంటివాడు. ఇపుడు నా కొడుకు శ్రీనివాస్ ను తన చేతిలో పెట్టాను. ఇపుడు శ్రీనివాస్ ను తన సొంత బిడ్డలా వినాయక్ చూసుకుంటూ.. తనకోసం వినాయక్ చాలా కష్టపడుతున్నాడు. వినాయక్ కు భారీ పారితోషకం చెల్లించానని అందరు అనుకొంటున్నారు కానీ. వినాయక్ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా కొనలేరు అని అన్నారు.