రికార్డులు బద్దలుకొడుతున్న మహేష్ 1
on Dec 5, 2013
"ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా... బుల్లెట్టు దిగిందా లేదా.." ఈ డైలాగ్ "పోకిరి" సినిమాలోది. కానీ మహేష్ ప్రస్తుతం ఈ బుల్లెట్టు లాగే తన ఎంట్రీతో సంబంధం లేకుండా రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ప్రిన్స్ అనే పేరును మరోసారి రికార్డులతో మోత మోగిస్తున్నాడు. అసలు ఇంతకీ మహేష్ ఏం చేసాడనే కదా మీ ప్రశ్న?
అసలు విషయం ఏమిటంటే... మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "1". ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఇదివరకే ఓ ఛానెల్ రికార్డు స్థాయి ధరలో సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా భారతీయ ఓవర్సీస్ హక్కులను బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 72కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే ఒక తెలుగు సినిమాను డిస్త్రిబ్యుషణ్ హక్కులను ఇంత మొత్తంలో అమ్మడుపోవడం ఇదే తొలిసారి అవుతుంది. అంటే ఇప్పటివరకు ఏ హీరో సినిమాకు దక్కని రికార్డ్స్ మహేష్ సినిమాకు దక్కడం విశేషంగానే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాతలు ఏ విధంగా కూడా స్పందించకపోవడంతో ఈ వార్త నిజమేనని అనిపిస్తుంది.
14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈనెల 19న భారీ స్థాయిలో ఆడియో విడుదల కార్యక్రమం చేయనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.