మార్చిలో నితిన్, కరుణాకరన్
on Jan 7, 2014
నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో రుపొందబోతుంది. అయితే ఈ చిత్రం "తొలిప్రేమ" సినిమాకు సీక్వెల్ అవునా? కాదా? అనే విషయం త్వరలోనే తెలియనుంది. లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్న నితిన్ కోసం ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్నారు. ప్రస్తుతం నితిన్ "కొరియర్ బాయ్ కళ్యాణ్", "హార్ట్ ఎటాక్" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి.