చిరంజీవిపై కోదండరామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
on Jul 10, 2016
చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంభినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న చిరుకి ఖైదీ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ తీసుకువచ్చారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత అదే బంధాన్ని కంటిన్యూ చేస్తూ వీరిద్దరి కాంభినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఎక్కడ కనిపించుకున్నా అప్యాయంగా పలకరించుకునేవారు.
తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత 150 వ సినిమాలో నటిస్తున్నారు చిరు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోదండరామిరెడ్డి. మెగాస్టార్ యాక్షన్, సందేశాత్మక సినిమాలు తీస్తే జనం నవ్వుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. కామెడీ పాళ్లు ఎక్కువ ఉండేలా చిరు సినిమా ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. తానైతే చిరంజీవితో కామెడీ సినిమానే తీస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో కలకలం రేపాయి..చిరుతో కోదండరామిరెడ్డికి ఎలాంటి విభేదాలు లేవు. ఏ కారణంతో చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది అంతుబట్టడం లేదు.