స్టార్ కమెడియన్ ఖాతాలో మరో హిట్టు!
on Jul 9, 2016
తమిళ స్టార్ కమెడియన్ సంతానం పట్టిందల్లా బంగారమవుతోంది. ఒక పక్క కమెడియన్ గా బిజీగా ఉంటూనే.. మరోపక్క హీరోగానూ ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాలకు నిర్మాత కూడా సంతానమే కావడం విశేషం. తాజాగా సంతానం హీరోగా నటించిన చిత్రం "ధిలుక్కు దుట్టు". హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న తమిళనాట విడుదలై.. మంచి రివ్యూలతోపాటు ప్రేక్షకుల ఆదరణను కూడా చూరగొంది. అంతేకాకుండా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ను కూడా దక్కించుకోంటుందట. నిజానికి ఈ చిత్రం గత నెలలోనే విడుదలవ్వాలి కానీ.. సంతానం తండ్రి హఠాన్మరణంతో సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అయితే.. పోస్ట్ పోన్ ఎఫెక్ట్ ఏమీ సినిమా మీదపడలేదు. రెగ్యులర్ హారర్ సినిమాల్లా కాకుండా.. హారర్ స్పూఫ్ గా రూపొందిన ఈ చిత్రం థియేటర్ లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంటోంది!