భారీ మొత్తంలో దోచేసిన నాని
on Dec 15, 2013
వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "డి ఫర్ దోపిడి". రాజ్ నిడిమోరు, కృష్ణా డికేలు తెలుగులో నిర్మిస్తున్నారు. హీరో నాని కూడా దీనికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ని కోటి 70లక్షలకు "జెమినీ" సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిరాజ్ కల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది నాని నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాలేదు. కానీ ఈ చిత్రంలో నాని మూడు నిముషాలు కనిపించబోతున్నాడని, దాంతో ఆ లోటుని ఈ చిత్రం తీరుస్తుందని నాని అన్నారు.