సెట్స్‌పై 'టక్ జగదీష్' అడుగుపెట్టాడు
on Feb 11, 2020
'నిన్నుకోరి' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రెండో సినిమా 'టక్ జగదీష్' గత నెలలో హైదరాబాద్ లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం పొల్లాచ్చిలోని సుందరమైన లొకేషన్లలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నాని ప్రేయసిగా నటిస్తోన్న రీతు వర్మ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ మరో నాయికగా నటిస్తున్నారు.
నాని హీరోగా నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ కింద సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాని విలన్‌గా నటిస్తోన్న 'వి' మూవీ మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఆ మూవీని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
