హాట్ రాకెట్ లా దుసుకేల్తున్న ప్రిన్స్
on Dec 16, 2013
మొన్న పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం ట్రైలర్ రీలిజ్ అయినపుడు ఎంత రికార్డుల మోత మోగించిందో... ప్రస్తుతం మహేష్ కూడా అలాంటి రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. మహేష్ నటిస్తున్న"1"మూవీ ఆడియో రిలీజ్ డేట్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. " Who are you" అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ ఇపుడు హాట్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది. టీజర్ విడుదలైన 20 గంటల్లోనే 235,702 మంది చూడడం జరిగింది. మహేష్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ ఇదే మొదటిసారి కావడం వలన, దేవి మరింత ఎనర్జీతో "1" సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈనెల 19న భారీ స్థాయిలో ఆడియో విడుదల కార్యక్రమం చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని,14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.