తెలంగాణ పోరడుగా నేచురల్ స్టార్
on May 23, 2020
సుకుమార్ దగ్గర 'రంగస్థలం' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'పడి పడి లేచె మనసు' నిర్మించి, ప్రస్తుతం 'విరాట పర్వం' నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపిస్తారని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలిసింది. నాని లుక్, యాక్టింగ్ రియలిస్టిక్ గా, రగ్గడ్ గా ఉంటాయట.
'కృష్ణార్జున యుద్ధం'లో నాని ద్విపాత్రాభినయం చేశాడు. అందులో ఓ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. ఆ సినిమా కోసం నాని చిత్తూరు యాస నేర్చుకున్నాడు. 'నిన్ను కోరి'లో విశాఖ కుర్రాడిగా కనిపించాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'టక్ జగదీశ్' కోసం గోదావరి యాసను బాగా ప్రాక్టీస్ చేశాడు. ఆ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడుతూ కనిపిస్తాడు. తెలంగాణ యాసలో మాత్రం ఇప్పటివరకు నాని మాట్లాడలేదు. శ్రీకాంత్ ఓడెల సినిమాలో తొలిసారి తెలంగాణ పోరాడుగా నాని కనిపించనున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
